News June 17, 2024

బిందు మాధవ్‌పై సస్పెన్షన్ ఎత్తివేత

image

ఐపీఎస్ అధికారి బిందు మాధవ్‌పై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఆయనను విధుల్లోకి తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సమయంలో ఘర్షణ నేపథ్యంలో పల్నాడు జిల్లా ఎస్పీగా ఉన్న బిందుమాధవ్‌ను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. దీనిపై ఆయన ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందిన ప్రభుత్వం సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Similar News

News January 15, 2026

GNT: రంగస్థల దిగ్గజం మొదలి నాగభూషణశర్మ

image

గుంటూరు (D) ధూళిపూడిలో 1935 జులై 24న జన్మించిన మొదలి నాగభూషణశర్మ, ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు. ఈయన ఉస్మానియా విశ్వవిద్యాలయం, అమెరికాలోని ఇల్లినాయిస్ వర్సిటీలో ఉన్నత విద్యనభ్యసించారు. సుమారు 70కి పైగా నాటకాలు, నాటికలు, రేడియో నాటికలు రచించారు. సాహిత్యం, నాటక రంగాలకు ఆయన చేసిన సేవలకుగాను ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం (2013) వంటి ఎన్నో అవార్డులు వరించాయి. 2019 జనవరి 15న తెనాలిలో మరణించారు.

News January 15, 2026

సంక్రాంతి.. కోళ్లను ఇలా గుర్తించండి

image

ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా చరిత్రలో కోడి పందేలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈకల రంగు, కాళ్ల రంగు, కళ్ల రంగును బట్టి వాటిని వేర్వేరు పేర్లతో పిలుస్తారు.
#డేగ: ఎరుపు రంగు ఈకలు కలిగినవి.
#కాకి: నలుపు రంగు ఈకలు కలిగినవి.
#నెమలి: పచ్చని రంగు ఛాయ కలిగినవి.
#పర్ల: తెలుపు రంగు ఈకల మీద నల్లటి మచ్చలు ఉన్నవి.
#అబ్రాస్: ఎరుపు, తెలుపు, నలుపు కలిసిన మిశ్రమ రంగు.
#సేతు: పూర్తిగా తెల్లగా ఉండే కోడి.

News January 15, 2026

కోడి పందెం శాస్త్రం.. వారానికి ఒక రంగు

image

కోడి పందేలలో వారాన్ని బట్టి రంగులకు, రోజును బట్టి దిశలకు ప్రాధాన్యం ఉందని పందెం రాయుళ్లు నమ్ముతారు.
ఆది, మంగళవారాల్లో డేగ రంగు కోళ్లు, సోమ, శనివారాల్లో నెమలి రంగు కోళ్లు, బుధ, గురువారాల్లో కాకి రంగు కోళ్లు గెలుపు సాధిస్తాయని అంచనా. అలాగే బరిలో కోడిని దింపే దిశ కూడా కీలకం. భోగి నాడు ఉత్తర దిశ నుంచి, సంక్రాంతి నాడు తూర్పు దిశ నుంచి, కనుమ నాడు దక్షిణ దిశ నుంచి వదిలితే విజయం వరిస్తుందని శాస్త్రం.