News June 17, 2024

150000 సీడ్ బాల్స్ తయారు చేసిన కుందుర్పి పాఠశాల పిల్లలు

image

కుందుర్పి మండలంలోని విలువల బడుల పిల్లలు 150000 సీడ్ బాల్స్ స్వయంగా చేసి నాటారు. దీనికంతటికి స్ఫూర్తి విలువల బడుల అధ్యాపకులు అవచ్చన్నారు ప్రస్తుత సమాజంలో మన వ్యవస్థలు చేయలేనీ పని మన కుందుర్పి మండలం విలువల బడుల పిల్లలు చేసి చూపించవచ్చని అధ్యాకులు లెనిన్ తెలిపారు. ఈ పిల్లలు తయారు చేసిన సీడ్ బాల్స్ మరో 3 సంవత్సరాల్లో చెట్లుగా అవ్వడం చూడవచ్చని అధ్యాపకులు పేర్కొన్నారు.

Similar News

News March 12, 2026

అనంతపురం జిల్లాలో 2,75,642 మంది రైతులు అర్హులు

image

అనంతపురం జిల్లా వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకం కింద 2,75,642 మంది రైతుల అర్హుల జాబితాను అధికారులు ప్రకటించారు. జిల్లాకు రూ.163.26 కోట్లు కేటాయించగా అందులో అన్నదాత సుఖీభవ పథకానికి రూ.110.26 కోట్లు, పీఎం కిసాన్‌కు రూ.53.01 కోట్లు విడుదల చేయనున్నారు. జిల్లాలో అత్యధికంగా శింగనమల నియోజకవర్గంలో 54,338 రైతులకు అందించనున్నారు.

News March 12, 2026

రూ.20 కోట్లతో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు

image

అనంతపురం నగరపాలక సంస్థ విద్యుత్ బిల్లుల భారం తగ్గించుకునేందుకు సొంతంగా సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ జస్వంత్ తెలిపారు. ఏటా రూ.10 కోట్ల వ్యయాన్ని ఆదా చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రూ.20 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ విన్నపం మేరకు సీఎం చంద్రబాబు ఈ ప్లాంట్ కు సహకారం అందించారు.

News March 11, 2026

అనంతపురం జిల్లాలో గ్యాస్ కొరత లేదు: జేసీ

image

అనంతపురం జిల్లాలో గ్యాస్ ఏజెన్సీల ద్వారా గ్యాస్ వినియోగదారులకు డొమెస్టిక్ సిలిండర్లు సాధారణంగానే సరఫరా కొనసాగుతోందని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ పేర్కొన్నారు. గ్యాస్ కొరత వస్తుందనే ఉద్దేశంతో వెంట వెంటనే వినియోగదారులు ఆన్‌లైన్‌లో గ్యాస్ బుకింగ్ చేయడానికి వెబ్ పోర్టల్ అనుమతించదన్నారు. సింగిల్ సిలిండర్ 21 రోజులు, డబుల్ సిలిండర్ 30 రోజుల వ్యవధి అన్నారు.