News June 17, 2024

భారీ వర్షం.. అవసరమైతే కాల్ చేయండి!

image

హైదరాబాద్ నగరంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈక్రమంలో రోడ్లపై వరద నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ వరద నీటిని తొలగించేందుకు DRF సిబ్బంది కృషి చేస్తున్నట్లు GHMC తెలిపింది. ఎలాంటి సమస్యలున్నా 040-21111111, 9000113667 ఫోన్ చేయాలని తెలిపింది. ద్విచక్ర వాహనదారులు అజాగ్రత్తగా ఉంటే స్కిడ్ అయ్యే అవకాశం ఉంది. వర్షం తగ్గే వరకూ బయటకెళ్లకపోవడమే మంచిది.

Similar News

News February 2, 2025

త్రిష తెలంగాణకు గర్వకారణం: రేవంత్

image

TG: అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్‌ను గెలుచుకున్న భారత జట్టుకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన త్రిషపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇలాంటి ప్లేయర్లు తెలంగాణకు గర్వకారణమని అన్నారు. మరింతగా రాణించి సీనియర్ జట్టులో స్థానం సంపాదించుకోవాలని ఆకాంక్షించారు. నైపుణ్యమున్న ప్లేయర్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు.

News February 2, 2025

భారత్ భారీ స్కోరు.. ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే?

image

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టీ20లో భారత జట్టు భారీ స్కోరు చేసింది. 20 ఓవర్లలో 247 పరుగులు నమోదు చేసింది. ఓపెనర్ అభిషేక్(135) సెంచరీతో చెలరేగారు. అభి తన ఇన్నింగ్సులో 13 సిక్సర్లు, 7 ఫోర్లు బాదారు. అతని హిట్టింగ్‌కు ఇంగ్లండ్ బౌలర్ల వద్ద సమాధానం లేకపోయింది. ఇంగ్లండ్ టార్గెట్ 248.

News February 2, 2025

రికార్డులతో ‘అభి’షేకం

image

భారత ఓపెనర్ అభిషేక్ శర్మ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. టీ20ల్లో ఒక ఇన్నింగ్సులో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచారు. 54 బంతుల్లోనే 13 సిక్సర్లు, 7 ఫోర్లతో 135 పరుగులు చేశారు. మరోవైపు ఒకే ఇన్నింగ్సులో అత్యధిక సిక్సర్లు బాదిన ఇండియన్ ప్లేయర్‌గానూ నిలిచారు.