News June 17, 2024

మాజీ మంత్రి వేణుగోపాల్‌పై మంత్రి సుభాశ్ ఆరోపణలు

image

మంత్రి వాసంశెట్టి సుభాశ్ మాజీ మంత్రి వేణుగోపాల్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ద్రాక్షారామలో నేడు ఆయన మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో నియోజకవర్గంలో దాదాపు 100 ఎకరాల భూముల్లో అవినీతి జరిగిందని ఆరోపించారు. వాటికి సంబంధించి తమ వద్ద అన్నీ ఆధారాలు ఉన్నాయని అన్నారు. అవినీతి, అక్రమాలను తర్వలోనే బయటకు తీసి చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Similar News

News March 20, 2026

20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం: ఎమ్మెల్యే ఆదిరెడ్డి

image

కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తోందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉగాది కానుకగా యువతకు బంగారు భవిష్యత్తు అందించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. గత 20 నెలల్లోనే 6,28,347 ఉద్యోగాలు భర్తీ చేశామని, నిరుద్యోగులంతా పట్టుదలతో పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

News March 19, 2026

పెరవలిలో అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన కారు

image

పెరవలిలో ఓ ఫంక్షన్ హాల్ సమీపంలో గురువారం ఓ కారు అదుపుతప్పి వేగంగా పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. అతివేగమే ప్రమాదానికి కారణమని, యువకుడు నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. కారులో ఉన్న ఇద్దరు ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

News March 19, 2026

కలెక్టరేట్‌లో ఉగాది సంబరాలు

image

రాజమహేంద్రవరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఉగాది ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి MLC సోము వీర్రాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అధికారులతో కలిసి పండుగ జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు నిస్వార్థంగా సేవలందిస్తున్న సిబ్బందిని ఆయన అభినందించారు. తెలుగు సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు.