News June 17, 2024
కృష్ణా: పీజీ పరీక్షలు రాసిన విద్యార్థులకు అలర్ట్

కృష్ణా వర్సిటీ పరిధిలో ఏప్రిల్ 2024లో నిర్వహించిన MA, M.COM, M.HRM4వ సెమిస్టర్ పరీక్షలకు(2023- 24 విద్యా సంవత్సరం) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు రేపు మంగళవారంలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.900 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగ కంట్రోలర్ తెలిపారు. వివరాలకు https://kru.ac.in/వెబ్‌సైట్ చూడవచ్చన్నారు.
Similar News
News February 27, 2026
బాపులపాడు డిప్యూటీ ఎంపీడీఓపై సస్పెన్షన్ వేటు

విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బాపులపాడు మండల డిప్యూటీ ఎంపీడీఓ లక్ష్మయ్యపై సస్పెన్షన్ వేటు పడింది. లక్ష్మయ్యను సస్పెండ్ చేస్తూ జిల్లా పంచాయతీ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. పన్ను వసూళ్లలో పురోగతి సాధించకపోవడం, సమీక్షా సమావేశాలకు గైర్హాజరు అవుతుండటం, OHSR ట్యాంక్‌లను పరిశుభ్రపర్చడంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డిప్యూటీ ఎంపీడీఓను సస్పెండ్ చేశారు.
News February 26, 2026
నీట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

మే 3న నిర్వహించనున్న నీట్ పరీక్షల ఏర్పాట్లపై న్యూఢిల్లీ నుంచి NTA డైరెక్టర్ జనరల్ రాజేష్ లఖని, రాష్ట్ర విద్యా కమిషనర్ భరత్ గుప్తాతో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కృష్ణాజిల్లా కలెక్టర్ DK బాలాజీ పాల్గొన్నారు. జిల్లాలో పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. కేంద్రాల వద్ద మౌలిక వసతులు, భద్రత విషయంలో రాజీ పడకూడదని అధికారులకు స్పష్టం చేశారు.
News February 26, 2026
అక్షర ఆంధ్ర లక్ష్యంగా ‘ఉల్లాస్-02’ అమలుకు కలెక్టర్ ఆదేశం

విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి కోన శశిధర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజి పాల్గొన్నారు. 100 శాతం అక్షరాస్యత సాధనకు కేంద్రం తెచ్చిన ‘ఉల్లాస్-02: అక్షర ఆంధ్ర’ కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. నిరక్షరాస్యత నిర్మూలనకు అందరూ కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.


