News June 17, 2024

24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

image

తిరుమలలో సెప్టెంబర్ నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జూన్ 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. 27న తిరుమ‌ల – తిరుప‌తి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, న‌వ‌నీత సేవ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, ప‌ర‌కామ‌ణి సేవ మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

Similar News

News March 20, 2026

చిత్తూరు జిల్లాలో వర్షపాత వివరాలు..!

image

అల్పపీడన ద్రోణి ప్రభావ కారణంగా గడచిన 24 గంటల్లో వి.కోట, గుడుపల్లె మినహా మిగిలిన 26 మండలాల్లో వర్షం కురిసింది. గంగవరంలో 39.4 mm, పలమనేరులో 37.8 mm వర్షపాతం నమోదైంది. మండలాలు వారీగా.. యాదమరిలో 28.0, పూతలపట్టు, రొంపిచెర్ల మండలాల్లో 24.2, పెనుమూరులో 23.2, వెదురుకుప్పంలో 22.2, బైరెడ్డిపల్లిలో 17.2, గుడిపాలలో 12.4, పాలసముద్రం, విజయపురం మండలాల్లో 12.2, చిత్తూరు రూరల్ లో 10.6 mm వర్షపాతం నమోదు అయింది.

News March 19, 2026

చిత్తూరు కలెక్టరేట్‌లో ఉగాది వేడుకలు

image

చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇన్‌ఛార్జ్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ప్రజలకు ఆయన ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఈ నూతన సంవత్సరంలో అందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొని ఉగాది పచ్చడిని స్వీకరించారు.

News March 19, 2026

తిరుపతి బస్టాండ్‌లో ఒకే రోజు 24 సెల్ ఫోన్లు చోరీ

image

తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ దొంగలకు నిలయంగా మారింది. రద్దీని దొంగలు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఉగాది, రంజాన్ పర్వదినాలు, ఇంటర్మీడియట్ పరీక్షలు ముగియడంతో బుధవారం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసింది. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శించి 24 సెల్ ఫోన్లు దొంగలించారు. తిరుపతి పోస్టల్ కాలనీకి చెందిన అనూష రాజంపేటకు వెళ్లేందుకు బస్టాండ్‌కు రాగా 150 గ్రా. బంగారు నగల బ్యాగు చోరీకి గురైంది.