News June 17, 2024

ప్రభుత్వానికి, పార్టీకి మధ్య వారధిగా పనిచేయాలి: చంద్రబాబు

image

ప్రభుత్వానికి, పార్టీకి మధ్య వారధిలా పని చేయాలని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా నియమితులైన పల్లా శ్రీనివాసరావుకు సీఎం చంద్రబాబు సూచించారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో శ్రీనివాసరావు సోమవారం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఐదేళ్లుగా పడిన కష్టం, పార్టీ బలోపేతానికి చేసిన కృషిని గుర్తించి అతిపెద్ద బాధ్యతను అప్పగించినట్లు చంద్రబాబు ఆయనకు చెప్పారు.

Similar News

News January 1, 2026

విశాఖలో ఒక్కరోజే రూ.9.90 కోట్ల మద్యం అమ్మకాలు

image

న్యూఇయర్ సందర్భంగా విశాఖలో మద్యం అమ్మకాలు ఊహించిన దానికంటే భారీగా నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజులోనే మద్యం అమ్మకాల ద్వారా రూ.9.90 కోట్ల ఆదాయం సమకూరింది. సాధారణంగా విశాఖలో రోజుకు రూ.5-6 కోట్ల వరకు ఆదాయం వస్తుంటే.. నిన్న అదనంగా రూ.3 కోట్లకుపైగా అమ్మకాలు జరిగాయి. నిన్న, ఈరోజు వైన్స్ షాపులకు అర్ధరాత్రి 12 గంటల వరకు, పబ్‌లు, ఈవెంట్లకు రాత్రి ఒంటిగంట వరకు మద్యం విక్రయాలకు ఎక్సైజ్ శాఖ అనుమతులు ఇచ్చింది.

News January 1, 2026

జీవన్‌దాన్ ద్వారా వారి జీవితంలో కొత్త వెలుగులు

image

రాష్ట్ర వైద్యరంగంలో మరో సరికొత్త రికార్డు నమోదయింది. 301 మందికి జీవన్‌దాన్ (అవయవ దానం) ద్వారా జీవితాల్లో వెలుగులు నింపారు. 2015 నుంచి ఇప్పటివరకు 1293 అవయవాలను సేకరించి అవసరమైన రోగులకు అందించామని విమ్స్ డైరెక్టర్ జీవన్‌దాన్ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ కే.రాంబాబు తెలిపారు. జీవన్‌దాన్ చేస్తున్న సేవలను రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్య కుమార్ యాదవ్ అభినందించారు.

News January 1, 2026

విశాఖలో కూటమి నేతల ఐక్యత స్వరం

image

స్టీల్ ప్లాంట్, విశాఖ భూముల అంశాలు, తదితర సమస్యలపై YCP, వామపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలకు సమాధానం చెప్పే విషయంలో విశాఖ MP, MLAలు ఒక్కో విధంగా స్పందిస్తున్నారనే విమర్శలు వినిపించాయి. దీంతో వీరి మధ్య సరైన సమన్వయం లేదన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయన్న వాదనలున్నాయి. అయితే అనూహ్యంగా బుధవారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ‘మేమంతా కలిసే ఉన్నాం’ అని సంకేతాలిచ్చారు.