News June 17, 2024
ఆ 136 మంది MPలు ప్రమాణస్వీకారం చేస్తారా?

కాంగ్రెస్&SPకి చెందిన 136 మంది MPల ప్రమాణస్వీకారం ప్రశ్నార్థకంగా మారింది. ప్రచారంలో గ్యారంటీల పేరుతో వారు ఓటర్ల నుంచి వివరాలు సేకరించారని, అది ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం లంచం కిందకి వస్తుందని ఇప్పటికే రాష్ట్రపతి వద్ద అభ్యర్థన దాఖలైంది. వారిపై అనర్హత వేటు వేయాలనే ఆ అభ్యర్థనపై ఆమె న్యాయ అభిప్రాయం కోరారు. పార్లమెంట్ సమావేశాలు ముంగిట వేళ రాష్ట్రపతి తీసుకోబోయే నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.
Similar News
News September 14, 2025
2 కీలక వికెట్లు కోల్పోయిన భారత్

పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచులో టీమ్ ఇండియా ఓపెనర్లు ఔటయ్యారు. గిల్ 10 రన్స్ చేసి స్టంపౌట్ అయ్యారు. అభిషేక్ శర్మ 2 సిక్సర్లు, 4 ఫోర్లతో రఫ్పాడించారు. అదే జోరులో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ దగ్గర క్యాచ్ ఇచ్చారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 4 ఓవర్లలో 42/2గా ఉంది. సూర్య సేన విజయానికి మరో 86 పరుగులు అవసరం.
News September 14, 2025
భారత్-పాక్ మ్యాచ్: షేక్ హ్యాండ్ ఇచ్చుకోని కెప్టెన్లు

ఆసియాకప్‌లో భారత్, పాక్ మ్యాచ్ సమయంలో ఇరు జట్ల కెప్టెన్లు సూర్య, సల్మాన్ ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. టాస్ సమయంలో కనీసం పలకరించుకోకపోగా షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఆసక్తి చూపించలేదు. ఇప్పటికే పాక్‌తో మ్యాచ్ ఆడొద్దని ఇండియన్ ఫ్యాన్స్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
News September 14, 2025
BREAKING: పాకిస్థాన్ స్కోర్ ఎంతంటే?

ASIA CUP-2025: టీమ్ ఇండియాతో జరుగుతున్న మ్యాచులో పాకిస్థాన్ బ్యాటర్లు తేలిపోయారు. 20 ఓవర్లలో ఆ జట్టు 127/9 పరుగులు చేసింది. భారత పేసర్లు, స్పిన్నర్ల ధాటికి ఒక్క బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ చేయలేకపోయారు. కుల్దీప్ 3, అక్షర్ పటేల్ 2, బుమ్రా 2, హార్దిక్ 1, వరుణ్ చక్రవర్తి 1 వికెట్ తీశారు. చివర్లో షాహీన్ అఫ్రిది 4 సిక్సర్లు బాదారు. మరి భారత్ ఎన్ని ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదిస్తుందో కామెంట్ చేయండి.