News June 17, 2024
ప్రతీ టెస్లా కారు హ్యాక్ అవ్వొచ్చు: రాజీవ్ చంద్రశేఖర్
ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చన్న టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ వ్యాఖ్యలను కేంద్ర మాజీమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తప్పుపట్టారు. EVM ఓట్లను లెక్కించి, భద్రపరిచే యంత్రం మాత్రమే అని, హ్యాక్ చేసేంత ఆధునాతన మెషీన్లు కావన్నారు. ఈవీఎంల గురించి మస్క్ తప్పుగా అర్ధం చేసుకున్నారని తెలిపారు. ప్రపంచంలోని ఏ ఎలక్ట్రానిక్ ఉత్పత్తి పూర్తి సెక్యూర్ కాదని, టెస్లా కార్లు సైతం హ్యాకింగ్‌కు గురవుతాయని చెప్పొచ్చని అన్నారు.
Similar News
News February 2, 2025
పంచాయతీ ఎన్నికలపై కీలక ప్రకటన
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై ఖమ్మం జిల్లా వైరా పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 15లోపే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. కాగా కులగణనపై ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక అందగా, ఈ నెల 4న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుని ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి తొలి వారంలో ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
News February 2, 2025
త్రిష తెలంగాణకు గర్వకారణం: రేవంత్
TG: అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్‌ను గెలుచుకున్న భారత జట్టుకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన త్రిషపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇలాంటి ప్లేయర్లు తెలంగాణకు గర్వకారణమని అన్నారు. మరింతగా రాణించి సీనియర్ జట్టులో స్థానం సంపాదించుకోవాలని ఆకాంక్షించారు. నైపుణ్యమున్న ప్లేయర్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు.
News February 2, 2025
భారత్ భారీ స్కోరు.. ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే?
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టీ20లో భారత జట్టు భారీ స్కోరు చేసింది. 20 ఓవర్లలో 247 పరుగులు నమోదు చేసింది. ఓపెనర్ అభిషేక్(135) సెంచరీతో చెలరేగారు. అభి తన ఇన్నింగ్సులో 13 సిక్సర్లు, 7 ఫోర్లు బాదారు. అతని హిట్టింగ్‌కు ఇంగ్లండ్ బౌలర్ల వద్ద సమాధానం లేకపోయింది. ఇంగ్లండ్ టార్గెట్ 248.