News June 17, 2024

చెల్లెళ్లతో ప్రభాస్

image

‘కల్కి’ సినిమాలోని భైరవ ఆంథమ్ సాంగ్ షూటింగ్ సమయంలో డార్లింగ్ ప్రభాస్ తన కజిన్స్ ప్రసీద, ప్రదీప్తి, ప్రకీర్తిలతో కలిసి సందడి చేశారు. వారితో కలిసి బల్లె బల్లె స్టెప్పులేశారు. ప్రముఖ సింగర్ దిల్జీత్ దోసాంజ్‌కు వారిని పరిచయం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి. భైరవ ఆంథమ్’ ఫుల్ వీడియో సాంగ్ ఈరోజు రిలీజవడంతో షూటింగ్ పిక్స్ బయటకొచ్చాయి.

Similar News

News April 2, 2026

కారు ఢీకొని ఇంజినీరింగ్ అసిస్టెంట్ మృతి

image

ఓర్వకల్లు మండలం కన్నమడకల సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రంగస్వామి (33) రోడ్డు ప్రమాదంలో మరణించారు. బుధవారం విధులు ముగించుకుని బైక్‌పై కర్నూలుకు వెళ్తుండగా ఎయిర్‌పోర్టు వద్ద కారు వెనక నుంచి ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన ఆయనను కర్నూలు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 2, 2026

రూ.1,000కోట్లు ఇచ్చేదాకా వైద్యం బంద్: ఆషా

image

NTR వైద్య సేవ నెట్‌వర్క్ ఆస్పత్రుల బంద్ కొనసాగనుంది. నిన్న ప్రభుత్వం, AP స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్(ఆషా) మధ్య చర్చలు జరిగాయి. రూ.3వేల కోట్లు ఇవ్వాలని ఆషా డిమాండ్ చేయగా, బకాయిలు రూ.2,100కోట్లే ఉన్నాయని ఆరోగ్యశాఖ సెక్రటరీ సౌరభ్ గౌర్ తెలిపారు. 2 వారాల్లో రూ.1,000కోట్లు, ప్రతినెలా రూ.250కోట్లు విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కాగా రూ.1,000కోట్లు ఇచ్చే వరకు బంద్ కొనసాగుతుందని ఆషా తెలిపింది.

News April 2, 2026

బరువు తగ్గాలా? సమ్మర్ బెస్ట్..!

image

వెయిట్ లాస్ కావడానికి వేసవి మంచి సీజన్. చలి, వర్షాకాలంతో పోలిస్తే ఈ సీజన్‌లో ఉదయం త్వరగా నిద్ర లేవచ్చు. వాకింగ్, రన్నింగ్‌కు వెళ్తే చెమట ద్వారా ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయి. స్విమ్మింగ్ కూడా మంచి ఎక్సర్‌సైజ్. వేడి వాతావరణం, వాటర్ ఎక్కువ తాగడం వల్ల ఆకలి వేయదు. ఇది ఒకరకంగా బరువు పెరగకపోవడానికి దోహదపడుతుంది. ఈ సీజన్‌లో లభించే పుచ్చ, నారింజ, దోస, కొబ్బరినీళ్లు తీసుకుంటే జీర్ణక్రియ మెరుగవుతుంది.