News June 17, 2024
నల్గొండ జిల్లాలో గంజాయి ముఠా అరెస్టు

నల్గొండ జిల్లాలో గంజాయి విక్రయిస్తున్న ఓ ముఠాను వాడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 12 మంది ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 6 కిలోల గంజాయి, రూ.46 వేల నగదు, బైకులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయిని ఏపీ నుంచి తెచ్చి మిర్యాలగూడలో అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు.
Similar News
News January 19, 2026
నల్గొండ: మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు

నల్గొండ జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల పరిధిలో మహిళా సంఘాలకు రూ.11.38 కోట్ల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేసినట్లు కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. సోమవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా రుణాల పంపిణీ, ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని కలెక్టర్ వివరించారు.
News January 19, 2026
నల్గొండ: ఇంటర్ కాలేజీలకు నిధులు మంజూరు

నల్గొండ జిల్లాలోని 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సైన్స్ ప్రాక్టికల్ పరికరాల కొనుగోలుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఒక్కో కళాశాలకు రూ.50,000 చొప్పున మొత్తం రూ.6.50 లక్షలను కేటాయించింది. ఈ పరికరాల సరఫరా కోసం అర్హులైన సంస్థల నుండి కొటేషన్లు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి తెలిపారు. ఆసక్తి గల వారు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News January 19, 2026
విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్ చంద్రశేఖర్

ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. సోమవారం జరిగిన ‘ప్రజావాణి’లో ఆయన ఫిర్యాదులను స్వీకరించారు. మండల ప్రత్యేక అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని స్పష్టం చేశారు. నూతన సర్పంచ్‌లు శిక్షణను సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.


