News June 17, 2024

వట్టిచెరుకూరు: పొక్లెయిన్ ఆపరేటర్ ఆత్మహత్య

image

వట్టిచెరుకూరు మండలం తాళ్లపాడు గ్రామానికి చెందిన పొక్లెయిన్ ఆపరేటర్ శివన్నారాయణ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కథనం మేరకు.. ఆవిరేణి కుంట తాండ గ్రామ సమీపంలో పొక్లెయిన్ విధులు నిర్వహిస్తున్న శివ నారాయణ కుటుంబ సమస్యల నేపథ్యంలో ఆ వాహనానికే ఉరేసుకున్నాడు. మృతుడి తల్లి రమణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News March 28, 2026

అమరావతిలో అత్యవసర సేవల లోపం బహిర్గతం

image

అమరావతిలో అత్యవసర సేవల లోపం బయటపడింది. ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదాల్లో రూ.19 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. ఉద్దండరాయునిపాలెంలో మధ్యాహ్నం జరిగిన ఘటనకు ఫైర్ ఇంజన్ 50 నిమిషాల తర్వాత చేరింది. మరో ఘటనలో కూడా స్పందన ఆలస్యం కనిపించింది. సమయానికి సహాయం అందక నష్టం పెరిగిందని విమర్శలు వస్తున్నాయి. రాజధాని అభివృద్ధి జరుగుతున్నా, భద్రతా సదుపాయాలు మెరుగుపర్చాలని ప్రజలు కోరుతున్నారు.

News March 28, 2026

GNT: ధాన్యం సేకరణ.. రికార్డు దిశగా..!

image

ఖరీఫ్ సీజన్‌లో మూడు జిల్లాల్లో ధాన్యం సేకరణకు భారీ లక్ష్యాలు నిర్ణయించారు. బాపట్లలో 2 లక్షల టన్నుల లక్ష్యానికి 1.88 లక్షల టన్నులు చేరగా, గుంటూరులో లక్ష టన్నులలో 82 వేల టన్నులు సేకరించారు. మార్కెట్ ధరలు మద్దతు ధర కంటే ఎక్కువగా ఉండటంతో రైతులు లాభపడ్డారు. కొనుగోలు కేంద్రాలు ఎక్కువకాలం తెరిచి ఉంచినా లక్ష్యాలకు స్వల్పంగా తగ్గాయి. శనివారంతో సేకరణ కేంద్రాలు మూతపడనున్నాయి.

News March 28, 2026

గుంటూరు: AI బయోమెట్రిక్ స్కామ్‌లపై ఎస్పీ హెచ్చరిక

image

AI బయోమెట్రిక్ స్కామ్‌లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే వీడియో కాల్స్‌కు స్పందించవద్దని, సోషల్ మీడియా ఖాతాలను ప్రైవేట్ సెట్టింగ్స్‌లో ఉంచుకోవాలని కోరారు. సైబర్ మోసానికి గురైతే తక్షణమే 1930 నంబర్‌కు ఫోన్ చేయాలని లేదా ఆన్‌లైన్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. సాంకేతికతతో పొంచి ఉన్న ముప్పును పసిగట్టాలని ఆయన హెచ్చరించారు.