News June 17, 2024
రైల్వే మంత్రి రీల్స్ చేయడంలో బీజీ: కాంగ్రెస్

బెంగాల్‌లో కాంచన్‌జంఘా, గూడ్స్ రైళ్ల ప్రమాదం నేపథ్యంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌పై కాంగ్రెస్ పార్టీ విమర్శలు ఎక్కుపెట్టింది. ‘ఆయన రీల్స్ చేయడంలో బిజీగా ఉన్నారు. ప్రజల రక్షణ గురించి పట్టించుకునే సమయం లేదు’ అని కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనతే విమర్శించారు. కాగా రాజకీయాలు చేసేందుకు ఇది సమయం కాదని, పనుల పునరుద్ధరణపైనే తమ దృష్టి ఉందని రైల్వే మంత్రి చెప్పుకొచ్చారు.
Similar News
News March 16, 2026
నేటి నుంచి పశువులకు ఫ్రీగా ‘గాలికుంటు’ టీకాలు

AP: రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి ఏప్రిల్ 29 వరకు పశువులకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను ప్రభుత్వం వేయనుంది. ఇందుకోసం 83.70 లక్షల టీకాలను పంపిణీ చేసింది. వెటర్నరీ డాక్టర్లు పాడి రైతుల ఇళ్ల వద్దకే వెళ్లి ఆవులు, గేదెలు, దూడలు, మేకలు, గొర్రెలకు ఈ టీకాలను వేస్తారు. కాలి గెట్టల మధ్య, నోట్లో పుండ్లు, జ్వరం ఈ వ్యాధి లక్షణాలు. సకాలంలో టీకాలు వేయకపోతే పశువులు మరణిస్తాయి.
News March 16, 2026
HYDలోకి డీజిల్ బస్సులకు నో ఎంట్రీ!

TG: హైదరాబాద్‌ను పర్యావరణహితంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా సిటీలోకి జిల్లాల నుంచి డీజిల్ బస్సులు రాకుండా కట్టడి చేయనుంది. ORR చుట్టూ ఆర్టీసీ టెర్మినళ్లను ఏర్పాటు చేసి, అక్కడి నుంచి ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రయాణికులను నగరంలోకి చేరవేయనుంది. HYDలోని డీజిల్ బస్సులనూ జిల్లాలకు తరలించి ఇక్కడ కేవలం ఎలక్ట్రిక్ బస్సులే వాడతామని ఇటీవల సీఎం <<19328203>>రేవంత్<<>> చెప్పిన విషయం తెలిసిందే.
News March 16, 2026
ఇండక్షన్ స్టవ్స్ వాడుతున్నారా?

గ్యాస్ కొరతతో ఇండక్షన్ స్టవ్స్ వాడకం పెరుగుతోంది. వీటిని వాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
*స్టీల్, ఐరన్ పాత్రలతో వంట చేసుకోవాలి. రాగి, అల్యూమినియం, గాజు, మట్టి పాత్రలతో సాధ్యం కాదు.
*స్టవ్ లోపల, కంట్రోల్ ప్యానల్‌పై నీళ్లు పడకూడదు.
*స్టవ్ చల్లబడేందుకు కింద ఫ్యాన్ ఉంటుంది. దానికి అడ్డుగా వస్తువులు పెట్టకూడదు.
*పాత్ర ఉంచాకే స్టవ్ ఆన్ చేయాలి. అవసరాన్ని బట్టి హీట్ పెంచాలి.


