News June 17, 2024
24 బంతుల్లో 21 డాట్ బాల్స్.. బంగ్లా బౌలర్ రికార్డు

T20WCలో నేపాల్‌తో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బౌలర్ తంజిమ్ హసన్ రికార్డు సృష్టించారు. 4 ఓవర్లలో 7 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టిన అతను రెండు మెయిడిన్లు సహా 21 డాట్ బాల్స్ వేశారు. WC హిస్టరీలో ఇవే అత్యధికం. గతంలో బార్ట్‌మన్(SA)vsSL, బౌల్ట్(కివీస్)vsఉగాండా, ఫెర్గూసన్(కివీస్)vs ఉగాండాపై 20 డాట్ బాల్స్ వేశారు. కాగా నేపాల్‌పై 21 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ <<13455375>>విజయం<<>> సాధించింది.
Similar News
News March 11, 2025
టాప్-20 పొల్యూటెడ్ సిటీస్.. ఇండియాలోనే 13

ప్రపంచంలోని టాప్-20 అత్యంత కాలుష్యమైన నగరాల్లో 13 ఇండియాలోనే ఉన్నట్లు IQAir కంపెనీ వెల్లడించింది. అస్సాంలోని బైర్నిహాట్ ఇందులో టాప్ ప్లేస్‌లో నిలిచింది. అత్యంత కాలుష్యమైన రాజధాని నగరాల్లో ఢిల్లీ తొలి స్థానంలో ఉంది. మరోవైపు 2024 మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీస్ లిస్టులో భారత్ ఐదో ర్యాంక్ పొందింది. కాగా వాయు కాలుష్యం వల్ల ఆయుర్దాయం 5.2 ఏళ్లు తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
News March 11, 2025
వేసవిలో కరెంట్ బిల్లు తక్కువగా వచ్చేందుకు టిప్స్

*ఫిలమెంట్, CFL బల్బులు కాకుండా LED బల్బులు ఉపయోగించాలి.
*BLDC టెక్నాలజీతో చేసిన ఫ్యాన్లు 60% వరకు కరెంటును సేవ్ చేస్తాయి.
*BEE స్టార్ రేటింగ్ ఎక్కువ ఉన్న ఏసీ తక్కువ కరెంటును వినియోగిస్తుంది.
*ఏసీ ఎల్లప్పుడూ 24°C, అంతకంటే ఎక్కువ ఉండాలి.
*ఫ్రిజ్ డోర్ ఒక్కసారి తీస్తే అరగంట కూలింగ్ పోతుంది. పదేపదే డోర్ తీయకుండా జాగ్రత్త పడాలి.
*ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ పరికరాలకు రెగ్యులర్ సర్వీసింగ్ చేయించాలి.
News March 11, 2025
జగన్‌తో రహస్య స్నేహం లేదు: సోము వీర్రాజు

AP: YS జగన్‌తో తనకు రహస్య స్నేహం ఉందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని BJP నేత సోము వీర్రాజు స్పష్టం చేశారు. CM అయ్యే వరకూ ఆయనతో పరిచయం కూడా లేదని తెలిపారు. ‘MLC టికెట్ కోసం నేను ఎలాంటి లాబీయింగ్ చేయలేదు. మంత్రిని అవుతాననేది అపోహ మాత్రమే. 2014లోనే చంద్రబాబు నాకు మంత్రి పదవి ఇస్తానన్నారు. చంద్రబాబు, అమరావతిని నేను వ్యతిరేకించాననడం అవాస్తవం. మోదీ-బాబు బంధంలాగే మా బంధం ఉంటుంది’ అని పేర్కొన్నారు.