News June 17, 2024
ఒక్క నిర్ణయంతో లక్షలాది మంది ప్రాణాలు కాపాడారు!

VOLVO కంపెనీ పరోక్షంగా లక్షల మంది ప్రాణాలను కాపాడిందనే విషయం మీకు తెలుసా? వోల్వో ఇంజినీర్ నిల్స్ బోహ్లిన్ 1959లో అత్యాధునిక థ్రీపాయింట్ సీట్ బెల్టును అభివృద్ధి చేశారు. ఇతర కంపెనీల వాహనాల్లో ప్రయాణించే వారు కూడా సీట్ బెల్టు ధరించి సురక్షితంగా ఉండాలని పేటెంట్‌ను అందరికీ ఉచితంగా అందజేశారట. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచంలోని కోట్లాది ప్రయాణికులకు మేలు చేసింది.
Similar News
News March 12, 2025
లిఫ్ట్ ఎక్కుతున్నారా? ఒక్క నిమిషం!

ఇళ్లు, ఆఫీస్‌లు, అపార్ట్మెంట్లు, షాపింగ్ మాల్స్‌లో నిత్యం లిఫ్ట్‌లు వాడుతుంటాం. కానీ ఎలివేటర్ల నిర్వహణ లోపం వల్ల ఇటీవల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అప్రమత్తతో వీటిని నివారించుకోవచ్చు. మీరు బటన్ నొక్కగానే లిఫ్ట్ మీ ఫ్లోర్‌కు వచ్చిందో లేదో ఒక్కసారి చూసుకోండి. ఒక్కోసారి లిఫ్ట్ క్యాబిన్ రాకున్నా డోర్లు తెరుచుకుంటాయి. చూడకుండా అందులోకి ఎక్కాలని చూస్తే కిందపడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.
News March 12, 2025
ఢిల్లీలో అంతర్జాతీయ భద్రతా సదస్సు

ఈ నెల 16న ఢిల్లీలో అంతర్జాతీయ భద్రతా సదస్సు జరగనుంది. అమెరికా, కెనడా, బ్రిటన్‌తో సహా 20 దేశాల గూఢచర్య విభాగాల అధినేతలు పాల్గొనే ఈ కార్యక్రమానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షత వహిస్తారు. ఉక్రెయిన్-రష్యా, గాజా యుద్ధం, తీవ్రవాదం, అంతర్జాతీయ నేరాలను ఎదుర్కోవడం వంటి అంశాలపై వీరు చర్చించనున్నారు. ఆస్ట్రేలియా, జర్మనీ, న్యూజిలాండ్ దేశాల ఇంటెలిజెన్స్ చీఫ్‌లు కూడా ఈ సమావేశానికి రానున్నారు.
News March 12, 2025
ఈ నెల 15న తణుకుకు సీఎం చంద్రబాబు

AP: ఈ నెల 15న పశ్చిమగోదావరిలోని తణుకులో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించే ప్రజావేదికలో ప్రసంగిస్తారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ వస్తువుల ప్రదర్శనను ఆయన ప్రారంభిస్తారు. సీఎం రాక నేపథ్యంలో జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీమ్ ఏర్పాట్లను సమీక్షించారు. పర్యటన షెడ్యూల్ ఇవాళ లేదా రేపు ఖరారు కానుంది.