News June 17, 2024
గ్యారీ నీ టైమ్ వేస్ట్ చేసుకోకు.. ఇండియాకు కోచ్‌గా వచ్చేయ్: భజ్జీ

పాకిస్థాన్ జట్టులో ఐక్యత లేదన్న ఆ టీమ్ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ వ్యాఖ్యలతో మాజీ క్రికెటర్ హర్భజన్ ఏకీభవించారు. ‘గ్యారీ నీ టైమ్ వేస్ట్ చేసుకోకు. తిరిగి టీమ్ ఇండియాకు కోచ్‌గా వచ్చేయ్. నువ్వొక అరుదైన వజ్రానివి. గొప్ప కోచ్‌వి, మెంటార్‌వి. భారత్ 2011 ప్రపంచకప్ గెలవడంలో నీది కీలకపాత్ర. జట్టులో అందరికీ స్నేహితుడిగా ఉంటూ ముందుకు నడిపించావ్’ అని భజ్జీ ఈ సౌతాఫ్రికా మాజీ దిగ్గజాన్ని ఆహ్వానించారు.
Similar News
News March 12, 2025
వర్రా రవీందర్ రెడ్డికి రిమాండ్

AP: YCP సోషల్ మీడియా కన్వీనర్ వర్రా రవీందర్ రెడ్డికి జగ్గయ్యపేట కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను జగ్గయ్యపేట సబ్ జైలుకు తరలించారు. చంద్రబాబు, పవన్‌పై SMలో అసభ్య పోస్టులు పెట్టారని జగ్గయ్యపేట (M) చిల్లకల్లు PSలో ఆయనపై BNS, IT యాక్టులోని పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో నిన్న NTR జిల్లా చిల్లకల్లు పోలీసులు వర్రాను PT వారెంట్‌పై అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
News March 12, 2025
తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా

TG: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగం అనంతరం తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. కాసేపట్లో స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. అంతకుముందు గవర్నర్ మాట్లాడుతూ ‘260 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తితో తెలంగాణ రికార్డు సృష్టించింది. రైతుల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం’ అని తెలిపారు.
News March 12, 2025
కార్తిక్ ఆర్యన్, శ్రీలీల డేటింగ్ రూమర్స్‌పై క్రేజీ న్యూస్

బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్‌తో నటి శ్రీలీల డేటింగ్ చేస్తున్నారనే ప్రచారం నేపథ్యంలో హీరో తల్లి మాలా తివారీ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ మంచి డాక్టర్‌ను కోడలిగా చేసుకోవాలని ఉందని ఆమె అన్నారు. శ్రీలీల మెడిసిన్ చేస్తున్న నేపథ్యంలో తాజా వ్యాఖ్యలు వీరిద్దరి డేటింగ్ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న శ్రీలీల.. కార్తిక్ ఆర్యన్‌తో ఓ మూవీలో నటిస్తున్నారు