News June 18, 2024

విజయనగరం: వైసీపీకి సీనియర్ నేత రాజీనామా

image

జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ పోతన్న వైసీపీకి రాజీనామా చేసినట్లు సోమవారం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ కు దశాబ్దాల కాలంగా సేవలందించిన ఈయన, మాజీ మంత్రి పెనుమత్స కు అత్యంత విధేయుడు గా పేరొందారు. వైఎస్సార్ మరణాంతరం వైసీపీ లో చేరి తన సేవలందించారు. పార్టీ కి వ్యక్తిగత కారణాల రీత్యా రాజీనామా చేస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావుకి తన రాజీనామా లేఖను పంపారు.

Similar News

News March 24, 2026

VZM: కొత్త నియోజకవర్గాలపై ఆసక్తి..

image

ఉమ్మడి విజయనగరం జిల్లాలో నియోజకవర్గాల సంఖ్య పెరగనుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2008 పునర్విభజనకు ముందు 10 నియోజకవర్గాలు ఉండేవి. వీటిలో తెర్లాం, సతివాడ, భోగాపురాన్ని రద్దు చేసి ఇతర నియోజకవర్గాల్లో విలీనం చేశారు. ఇప్పుడు మళ్లీ నియోజకవర్గాలు పెరుగుతున్న క్రమంలో వీటిని మళ్లీ పునరుద్ధరిస్తారా? కొత్త నియోజకవర్గాలను ఏర్పాటు చేస్తారా అనేది వేచి చూడాలి.

News March 24, 2026

జిల్లా ర్యాంక్ మెరుగుపడేలా కృషి చేయాలి: VZM కలెక్టర్

image

వాట్సాప్ గవర్నెన్స్ సేవలను విస్తరించి, కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్‌లో A+ గ్రేడ్ సాధించేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పబ్లిక్ పాజిటివ్ పెర్సప్షన్ క్రింద ప్రజల అభిప్రాయాన్ని ప్రభుత్వం తీసుకుంటోందని, అందులో ప్రతికూలంగా ఉన్న అంశాలపై అధికారులు దృష్టి పెట్టి ర్యాంక్ మెరుగుపడేలా కృషి చేయాలన్నారు.