News June 18, 2024

నేడు ప్రకాశం జిల్లాకు వర్ష సూచన

image

ప్రకాశం జిల్లాలో మంగళవారం వర్షాలు పడే అవకాశం ఉంది. జిల్లాలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడే ఆస్కారం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) వెల్లడించింది. మరోవైపు, పొరుగున ఉన్న గుంటూరు జిల్లాలోనూ వర్షాలు పడతాయని APSDMA అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.

Similar News

News November 8, 2025

ముండ్లమూరు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

ముండ్లమూరు మండలం వేంపాడు-పోలవరం మధ్యలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. అద్దంకి నుంచి వస్తున్న ఇద్దరు యువకులు ట్రాక్టర్‌ను క్రాస్ చేసే క్రమంలో గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. చాట్ల వంశీ అక్కడికక్కడే మృతి చెందగా, షేక్ సుభానిని 108లో అద్దంకి తీసుకువెళ్తుండగా మార్గం మధ్యలో చనిపోయినట్లు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 7, 2025

రేపు ప్రకాశం జిల్లాలో పాఠశాలలకు సెలవు రద్దు

image

మొంథా తుఫాను కారణంగా జిల్లాలో గత నెలలో ఐదు రోజులపాటు పాఠశాలలకు సెలవులు ఇచ్చిన కారణంగా ఈనెల 8న రెండో శనివారం అన్ని యాజమాన్య పాఠశాలలు యథావిధిగా నిర్వహించాలని DEO కిరణ్ కుమార్ శుక్రవారం తెలిపారు. 2026 మార్చి వరకు ప్రతి రెండో శనివారం పాఠశాలలను నిర్వహించాలన్నారు. పాఠశాలల సిబ్బంది నియమాలు పాటించాలన్నారు.

News November 7, 2025

ఒంగోలు: RTC బస్‌కు తప్పిన ప్రమాదం

image

ఒంగోలు సమీపంలో RTC బస్సుకు పెను ప్రమాదం తప్పింది. నిన్న రాత్రి ఒంగోలు నుంచి కొండపికి ఓ బస్ బయల్దేరింది. చీమకుర్తికి వెళ్తున్న టిప్పర్‌కు పేర్నమిట్ట వద్ద ఓ గేదె అడ్డు వచ్చింది. టిప్పర్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. ఇదే సమయంలో వెనుక వస్తున్న ఆర్టీసీ బస్సు టిప్పర్‌ను ఢీకొట్టింది. బస్సు ముందు భాగం దెబ్బతింది. ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.