News June 18, 2024

ప.గో.: పార్ట్‌టైం ఉద్యోగం పేరుతో చీటింగ్

image

నరసాపురానికి చెందిన నరేశ్ ఓ యాప్‌లో పార్ట్‌ టైం ఉద్యోగ ప్రకటన చూసి నిర్వాహకులను సంప్రదించాడు. యాప్‌లో వచ్చే ప్రచారాలు చూస్తే నగదు ఇస్తామని వారు నమ్మించారు. తొలుత నరేశ్ ఖాతాలో రూ.10వేలు జమచేశారు. ఆ తర్వాత నగదురాకపోగా నరేశ్ ప్రశ్నించాడు. కొంత నగదుచెల్లిస్తే బకాయి మొత్తం ఇస్తామని చెప్పారు. అదినమ్మి నిర్వాహకుల ఖాతాల్లో రూ.6.86లక్షల వరకు జమచేశాడు. చివరికి మోసపోయానని గుర్తించి పోలీసులకు ఫిర్యాదుచేశాడు.

Similar News

News March 17, 2026

ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్.. 24 అర్జీల స్వీకరణ

image

పాలకోడేరు మండలం గొల్లలకోడేరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘పీజీఆర్‌ఎస్’ కార్యక్రమంలో SP అద్నాన్ నయీం అస్మి 24 అర్జీలను స్వీకరించారు. వీటిలో కుటుంబ కలహాలు, సైబర్‌ నేరాలు, భూ వివాదాలపై ఫిర్యాదులు అందాయి. బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని అధికారులను SP ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడేది లేదని ఆయన స్పష్టం చేశారు.

News March 17, 2026

ఏలూరు రాజకీయాల్లో “పుట్టా“ రచ్చ

image

ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న ఏలూరు రాజకీయాల్లో హైదరాబాద్ ఫాంహౌస్ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. డ్రగ్స్ తీసుకునే పార్టీలో ఎంపీ పట్టుబడటం అనేది రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎంపీ డ్రగ్స్ తీసుకున్నారని టెస్ట్‌లో పాజిటివ్ రావడాన్ని ఈగల్ టీమ్ SP ధృవీకరించారు. అయితే తాను ఏ తప్పు చేయలేదని నిర్దోషిగా బయటకొస్తానని MP అంటున్నారు. ఇటు టీడీపీ శ్రేణులు సైతం ఎంపీపై కుట్ర జరుగుతోందంటూ కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు.

News March 17, 2026

భీమవరం: ‘ఎండ తీవ్రతను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి’

image

రాబోయే వేసవిలో ఎండ తీవ్రతను ఎదుర్కొనేందుకు అధికారులు ముందస్తు చర్యలతో సిద్ధంగా ఉండాలి కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో భీమవరం కలెక్టరేట్లో సమీక్ష సోమవారం సమావేశాన్ని నిర్వహించారు. ప్రజలు అధికంగా రాకపోకలు చేసే ముఖ్య కూడళ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఆసుపత్రులు, పాఠశాలలు వంటి ప్రదేశాలను గుర్తించి అక్కడ తాగునీటి సదుపాయం కల్పించాలని అధికారులను ఆదేశించారు.