News June 18, 2024

తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నీ ఖాళీ

image

కృష్ణా, గోదావరి బేసిన్‌లోని రిజర్వాయర్లు నీళ్లు లేక వెలవెలబోతున్నాయి. గతేడాది వర్షాభావంతో ప్రాజెక్టుల్లోకి నామమాత్రంగానే నీరొచ్చింది. కృష్ణా నదిపై ఎగువ రాష్ట్రాల్లోని ఆలమట్టి, తుంగభద్ర కూడా ఖాళీగా ఉన్నాయి. అవి నిండిన తర్వాతే నీటిని దిగువకు వదలనున్నారు. అటు గోదావరిపై నిర్మించిన మేడిగడ్డలోకి నీళ్లు రావాలంటే MHలోని జైక్వాడి ప్రాజెక్టు నిండాలి. AP, TG ప్రాజెక్టులన్నీ కళకళలాడాలంటే 560 TMCలు కావాలి.

Similar News

News March 7, 2026

వార్ ఎఫెక్ట్.. వంట గదిలో ధరల ‘మంట’

image

గల్ఫ్‌ యుద్ధం ప్రభావం ధరల రూపంలో మనపై పడుతోంది. తాజాగా సిలిండర్ <<19316911>>పెంపు<<>> దీనికి నిదర్శనం. భారత్‌తో పాటు జపాన్, చైనా, యూరప్‌ దేశాలకు ఖతర్ ఉత్పత్తి కేంద్రం నుంచి లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్(LNG), అనుబంధ ప్రొడక్టులు సప్లై అవుతాయి. వార్ నేపథ్యంలో ప్రొడక్టివిటీని నిలిపివేస్తున్నామని ఇటీవల ఖతర్ <<19299424>>ప్రకటించింది<<>>. దీంతో ఇప్పటికే యూరప్, ఆసియాలో గ్యాస్ ధరలు పెరగగా తాజాగా మన దేశంలోనూ సామాన్యులపై భారం పడింది.

News March 7, 2026

గ్యాస్ సరఫరా ఆపకండి.. IOCLకు TTD లేఖ!

image

AP: యుద్ధం వేళ కమర్షియల్ గ్యాస్ వినియోగంపై కేంద్రం <<19309548>>నియంత్రణ<<>> నేపథ్యంలో TTD అధికారుల్లో ఆందోళన మొదలైంది. నిత్యం వేలాది మంది భక్తులు సందర్శించే తిరుమలకు గ్యాస్ సరఫరా ఆపొద్దని IOCLను కోరింది. లేదంటే అన్న ప్రసాదాల తయారీతో పాటు ఇతర అవసరాలకు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుందని లేఖ రాసినట్లు సమాచారం. TTDని ఆధ్యాత్మిక పరిధిలో ఉంచి సరఫరాను కొనసాగించాలని కోరగా IOCL సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

News March 7, 2026

భారీగా పెరిగిన సిలిండర్ ధరలు

image

వంట గ్యాస్, కమర్షియల్ LPG సిలిండర్ ధరలను కేంద్రం భారీగా పెంచింది. 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్‌పై 60 రూపాయలు, 19 కిలోల కమర్షియల్ సిలిండర్‌పై ₹115 పెంచింది. ఈ కొత్త ధరలు ఈరోజు నుంచే అమలులోకి వచ్చాయి. దీంతో హైదరాబాద్‌లో 14.2kg డొమెస్టిక్ సిలిండర్ ధర ₹905 నుంచి ₹965కు, 19kg కమర్షియల్ సిలిండర్ ధర ₹1,961 నుంచి ₹2,076కు చేరింది.