News June 18, 2024
భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు కోచ్‌పై వేటు
ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో భారత్ వెనుదిరగడంతో జట్టు కోచ్ స్టిమాక్‌ను AIFF తప్పించింది. ఇంకా రెండేళ్ల పదవీ కాలం ఉన్నప్పటికీ ఆయనపై వేటు వేసింది. జట్టును ముందుకు తీసుకెళ్లేందుకు కొత్త కోచ్ అవసరమని సభ్యులు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు పేర్కొంది. కాగా కాంట్రాక్ట్‌ను మధ్యలో రద్దు చేసినందుకు స్టిమాక్‌కు AIFF రూ.3 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది.
Similar News
News January 16, 2025
సైఫ్‌ను రూ.కోటి డిమాండ్ చేసిన దుండగుడు!
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు ఇంట్లోకి చొరబడి దాడి చేసే ముందు సైఫ్‌ను రూ.కోటి డిమాండ్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీనికి ఒప్పుకోకపోవడంతో అగంతకుడు దాడి చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటకొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం సైఫ్ ఆరోగ్యం నిలకడగా ఉంది.
News January 16, 2025
ఈడీ ఆఫీస్ నుంచి బయటికొచ్చిన కేటీఆర్
TG: ఫార్ములా-ఈ కారు రేస్ కేసులో విచారణ అనంతరం మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ ఆఫీస్ నుంచి బయటికొచ్చారు. ఆయనకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. అటు సుమారు 7 గంటలపాటు కేటీఆర్‌ను అధికారులు విచారించారు. HMDA ఖాతా నుంచి విదేశీ సంస్థకు రూ.45 కోట్లు చెల్లించడంపై ప్రధానంగా ప్రశ్నలు సంధించారు.
News January 16, 2025
600 బ్యాంక్ ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 600 ప్రొబెషనరీ ఆఫీసర్స్(PO) దరఖాస్తుల గడువు ఈనెల 19కి పొడిగించింది. అభ్యర్థులు ఇక్కడ <