News June 18, 2024

3 విడతల్లో రైతు రుణమాఫీ?

image

TG: తొలి ఏకాదశి(జూలై 17)న రైతు <<13454444>>రుణమాఫీ <<>>ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 15లోపు 3 విడతల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. రుణమాఫీ కోసం నిధుల సమీకరణ కొలిక్కి వస్తుండటంతో ముందే ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని ద్వారా అప్పటికే వ్యవసాయ పనులు ప్రారంభించిన రైతులకు మళ్లీ రుణం తీసుకునేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

Similar News

News October 7, 2024

చెరువులపై సమగ్ర అధ్యయనం.. 3 నెలల్లో సర్వే పూర్తికి ఆదేశం

image

TG: HMDA పరిధిలోని చెరువులపై సమగ్ర అధ్యయనం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. 3 నెలల్లో సర్వే పూర్తి చేసి చెరువుల విస్తీర్ణం, FTL, బఫర్ జోన్లను గుర్తించాలని అధికారులను ఆదేశించింది. సర్వే పూర్తయ్యాక ఆ వివరాలన్నింటినీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

News October 7, 2024

అద్భుతమైన ఫొటోలు

image

చెన్నై మెరీనా బీచ్‌లో జరిగిన ఎయిర్ షోకు లక్షలాదిగా జనం తరలివచ్చిన విషయం తెలిసిందే. ఎయిర్ షోలో ఆకాశం మీద నుంచి జెట్ విమానాలను తీసిన ఫొటోలు తాజాగా వైరలవుతున్నాయి. సముద్రం, పక్కనే చెపాక్ క్రికెట్ స్టేడియం, పొగలు కక్కుతూ దూసుకెళ్తోన్న జెట్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫొటోల్లో చెన్నై అందాలు కనిపిస్తున్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ ఎయిర్ షోకు భారీగా జనం పోటెత్తడంతో ఐదుగురు మరణించారు.

News October 7, 2024

నాలుగు నెలల్లో స్టార్ హీరో సినిమా పూర్తి!

image

తమిళ స్టార్ హీరో సూర్య, కార్తీక్ సుబ్బరాజు కాంబోలో రాబోతున్న ‘SURIYA44’ షూటింగ్ పూర్తయింది. కేవలం నాలుగు నెలల్లోనే ఈ చిత్రాన్ని పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఏడాది మార్చి 28న ఈ సినిమాను అనౌన్స్ చేయగా జూన్ 2న షూటింగ్ ప్రారంభించారు. నిన్న షూటింగ్ కంప్లీట్ చేశారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని చాలా మంది డైరెక్టర్లు కార్తీక్‌ను చూసి నేర్చుకోవాలని నెటిజన్లు సూచిస్తున్నారు.