News June 18, 2024

దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు.. సరికొత్త గరిష్ఠాలు నమోదు!

image

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు సెషన్‌ను లాభాలతో ప్రారంభించాయి. సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త గరిష్ఠాలను తాకాయి. ప్రస్తుతం 320 పాయింట్లు పెరిగి 77,316 వద్ద ట్రేడవుతున్న సెన్సెక్స్ ఓ దశలో 77,347 చేరి ఆల్ టైమ్ రికార్డ్ నమోదు చేసింది. నిఫ్టీ సైతం 23,573 చేరి సరికొత్త గరిష్ఠాలను తాకింది. మెటల్, PSU బ్యాంకులు, ఐటీ రంగాల షేర్లు లాభాలను నమోదు చేయడం మార్కెట్లకు కలిసొచ్చింది.

Similar News

News December 29, 2024

UGC నెట్ అడ్మిట్ కార్డులు విడుదల

image

UGC-నెట్ అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. అభ్యర్థులు అప్లికేషన్ నంబర్, DOB, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి వీటిని పొందవచ్చు. 85 సబ్జెక్టులకు జనవరి 3 నుంచి 16 వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు జరుగుతాయి. అడ్మిట్ కార్డులపై ఫొటో, బార్‌కోడ్, క్యూఆర్ కోడ్‌ను అభ్యర్థులు చెక్ చేసుకోవాలని, సరిగ్గా లేకుంటే మళ్లీ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. అడ్మిట్ కార్డుల కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

News December 29, 2024

నేను మరాఠీ.. నా పిల్లల్ని తెలుగులోనే చదివిస్తున్నా: మంత్రి సత్యకుమార్

image

AP: తాను మరాఠీ అయినా తన పిల్లల్ని తెలుగులోనే చదివిస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మాతృ భాషలో చదువుకుంటేనే పిల్లలకు తెలివితేటలు వస్తాయని చెప్పారు. విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో ఆయన మాట్లాడారు. ‘సంస్కృతి, వారసత్వం అన్ని భాషతోనే ముడిపడి ఉంటాయి. ప్రస్తుతం చాలామందికి తెలుగు రాయడం, చదవడం రావడం లేదు. మన తెలుగు ఎప్పటికీ నిలిచి ఉంటుంది’ అని మంత్రి వ్యాఖ్యానించారు.

News December 29, 2024

నితీశ్ కుమార్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

image

నితీశ్ కుమార్ రెడ్డి తెలుగువాడైనందుకు గర్వంగా ఉందని చాలా మంది పోస్టులు పెడుతుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘నువ్వు “భారత్”లోని ఏ ప్రాంతం నుంచి వచ్చావనే దానికంటే దేశం గర్వించేలా ఏం చేశావన్నదే ముఖ్యం. ఇలాంటి వరల్డ్ క్లాస్ రికార్డులెన్నో సాధించాలని కోరుకుంటున్నా. భారత జెండాను ఉన్నతస్థాయికి తీసుకెళ్లి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలవాలి’ అని ట్వీట్ చేశారు.