News June 18, 2024

175 నాటౌట్: భారత క్రికెట్‌లో చిరస్మరణీయం!

image

సరిగ్గా 41 ఏళ్ల క్రితం.. జూన్ 18, 1983. జింబాబ్వేతో వరల్డ్ కప్ మ్యాచ్‌. భారత్ 9 రన్స్‌కే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఆ దశలో బ్యాటింగ్‌కు వచ్చారు కపిల్ దేవ్. 138 బంతుల్లో 175 రన్స్‌(నాటౌట్)తో టీం ఇండియా స్కోరును 266 పరుగులకు చేర్చారు. ఛేజింగ్‌లో జింబాబ్వే 235 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో వారం తర్వాత తమ తొలి వన్డే ప్రపంచకప్‌ను గెలిచింది భారత జట్టు.

Similar News

News March 5, 2026

FLASH: మళ్లీ తగ్గిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధర మరోసారి తగ్గింది. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు ఉదయం నుంచి రూ.1,630 తగ్గి రూ.1,62,880కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,500 పతనమై రూ. 1,49,300 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.2,95,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వీటి ధరల్లో కాస్త మార్పులుండొచ్చు.

News March 5, 2026

ఎక్కువ చదివినవారిలోనే నిరుద్యోగులు అధికం!

image

ఇండియాలో చదువు పెరిగే కొద్దీ నిరుద్యోగం కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జాతీయ నిరుద్యోగ సగటు 3.2% ఉంటే డిగ్రీ చదివిన వారిలో ఇది 13%గా ఉంది. దీనిని ‘ఎడ్యుకేషన్ పారడాక్స్’ అంటారు. తక్కువ చదువుకున్న వారు ఏదో ఒక చిన్న పనిలో త్వరగా చేరుతుండగా.. పట్టభద్రులకు వారి స్థాయికి తగ్గ ఉద్యోగాలు దొరకట్లేదు. డిగ్రీలున్నా నైపుణ్యాలు లేకపోవడం& ఉద్యోగాల కొరతే దీనికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.

News March 5, 2026

ఖలిస్థానీ విమర్శకురాలు, యూట్యూబర్ దారుణ హత్య

image

ఖలిస్థానీ విమర్శకురాలు, పంజాబ్ సంతతికి చెందిన యూట్యూబర్ నాన్సీ గ్రేవాల్(45) కెనడాలో దారుణ హత్యకు గురయ్యారు. మంగళవారం రాత్రి ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు ఆమెను పలుమార్లు కత్తితో పొడిచి పారిపోయాడు. SMలో యాక్టివ్‌గా ఉండే నాన్సీ ఖలిస్థానీ కార్యకలాపాలను విమర్శిస్తూ వీడియోలు పోస్టు చేసేవారు. తీవ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ కామెంట్లనూ ఖండించేవారు. ఆమె హత్యపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.