News June 18, 2024

మద్దూర్: పులులకు హాని కలిగిస్తే రూ.10 లక్షలు జరిమానా!

image

మద్దూర్ మండల పరిధిలోనీ చెన్నారెడ్డిపల్లి, కంసాన్‌పల్లి, పరిసర ప్రాంతాల్లో చిరుత పులులు సంచరిస్తున్నాయని, అప్రమత్తంగా ఉంటూ.. వాటికి హాని తలపెట్టకూడదని మద్దూరు మండల ఫారెస్టు అధికారి లక్ష్మణ్ సోమవారం తెలిపారు. వాటికి నష్టం కల్గించే ప్రయత్నాలు పొలాలకు విద్యుత్తు తీగలు ఏర్పాట్లు, చనిపోయిన జీవాలకు విషప్రయోగం చేస్తే.. రూ.10లక్షల జరిమానా, జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు.

Similar News

News March 21, 2026

పాలమూరు:GET READY.. నేడే రంజాన్

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా పవిత్ర రంజాన్ (ఈద్-ఉల్- ఫితార్) మాసం నేపథ్యంలో సామూహిక ప్రార్థనల (నమాజ్) కోసం ఈద్గా, మస్జీద్ ల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈద్ నమాజ్ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముస్లింలు గత నెలరోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు, ప్రతిరోజు ఐదు పూటలా నమాజ్, ప్రత్యేక తరావీ నిర్వహించారు. రంజాన్ పండుగ నేపథ్యంలో నేడు సందడి నెలకొననుంది.
#ఈద్ ముబారక్

News March 20, 2026

MBNR: రంజాన్ ఎంతో పవిత్రమైనది: ఎస్పీ

image

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ డి.జానకి ముస్లింలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ అందరి జీవితాల్లో ఆనందం, శాంతిని నింపాలని ఆమె ఆకాంక్షించారు. ఉపవాస దీక్షల ద్వారా పొందే ఆత్మశుద్ధి, సహనం, సేవాభావం సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని ఈ సందర్భంగా ఎస్పీ పేర్కొన్నారు.

News March 20, 2026

MBNR: రంజాన్.. బందోబస్తు ఏర్పాట్లపై నిఘా

image

మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి ఆదేశాల మేరకు శుక్రవారం పట్టణంలోని ఇద్గా వక్ఫ్-ఎ-రహ్మానియా వద్ద అదనపు ఎస్పీ ఎన్.బి.రత్నం బందోబస్తు ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు. ఈద్ ఉల్ ఫితర్ నమాజ్‌కు భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు హాజరుకానున్న నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఇజాజుద్దీన్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.