News June 18, 2024
HYD: మెట్రో ఎండీ NVS రెడ్డిని కలిసిన ఎంపీ రఘునందన్ రావు

హైదరాబాద్ మెట్రో రైల్ భవన్‌కి ఎంపీ రఘునందన్ ఈరోజు వచ్చారు. బేగంపేట్‌లోని మెట్రో స్టేషన్‌లో మెట్రో రైల్ ఎండీ NVS రెడ్డిని ఎంపీ రఘునందన్ రావు కలిసి వినతిపత్రం అందజేశారు. మియాపూర్ నుంచి పటాన్‌చెరుకు, అక్కడి నుంచి సంగారెడ్డికి మెట్రో రైల్‌ను విస్తరించాలని మెట్రో రైలు ఎండీని మెదక్ ఎంపీ రఘునందన్ రావు కోరారు. దీనికి ఎండీ NVS రెడ్డి సానుకూలంగా స్పందించారు.
Similar News
News March 16, 2026
రంగారెడ్డిలో రూ.లక్ష బండిపై 90% సబ్సిడీ

SC నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు RR కలెక్టరేట్ ప్రకటన విడుదల చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 2 వీలర్‌కు 90%, 3 వీలర్‌కు 70% సబ్సిడీతో EV’s కొనుగోలుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆదాయ, కుల, రేషన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ జతచేయాలని SC కార్పొరేషన్ ED పద్మావతి సూచించారు. రేపటి నుంచి 26 వరకు tgobmms.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు.
# SHARE IT
News March 14, 2026
పది పరీక్షలకు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు: రంగారెడ్డి DEO

పదోతరగతి పరీక్షలకు ఉదయం 9:35 తర్వాత వచ్చిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని రంగారెడ్డి జిల్లా డీఈఓ సుశీందర్ రావు అన్నారు. ప్రతి సెంటర్‌ను ఒక సిట్టింగ్ స్క్వాడ్ సహా జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ అధికారులతో పది ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. చూచిరాతలు, చీటీలకు ఆస్కారం లేకుండా అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిఘా పెట్టినట్లు తెలిపారు.
News March 14, 2026
RR: ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు

ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఇప్పటి వరకు ప్రభుత్వ, ప్రైవేటు వసతి గృహాల్లో ఉంటూ చదువుతున్న విద్యార్థులు శుక్రవారం వాటిని ఖాళీ చేసి, సొంతూళ్లకు పయనమయ్యారు. రేపటి నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం కానుంది. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఫస్టియర్‌లో 84,301 మంది, సెకండియర్‌లో 70,171 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా.. 200 పరీక్ష కేంద్రాల్లో 96 శాతం మంది హజరయ్యారు.


