News June 18, 2024

నెల్లూరు: ఇంకా కోలుకోని YCP నేతలు..!

image

నెల్లూరు జిల్లాలోని అన్ని స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఓటమి చవిచూశారు. ఆ ఘోర ప్రభావం నుంచి నేతలు ఇంకా కోలుకోలేదు. ఒకరు ఇద్దరు మినహా మిగిలిన వాళ్లు ఎవరూ ఇప్పటికీ చాలామంది ప్రజల్లోకి రాలేదు. నిన్న బక్రీద్ కావడంతో టీడీపీ ఎమ్మెల్యేలు పలు చోట్ల ప్రార్థనల్లో పాల్గొనగా.. వైసీపీ నేతలు సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షల పోస్ట్‌లకే పరిమితమయ్యారు. మరోవైపు నేతల భరోసా కోసం కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు.

Similar News

News March 24, 2026

నెల్లూరు: ఇళ్లను నిర్మించని ఏజెన్సీలకు నోటీసులు

image

నెల్లూరు జిల్లాలో గత ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణాలకు కొన్ని ఏజెన్సీలు ముందుకు వచ్చాయి. చాలా ఏజెన్సీలు ఇళ్ల పనులను మధ్యలో నిలిపి వేశాయి. అయినప్పటికీ పూర్తి స్థాయిలో నిధులు డ్రా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో 29 ఏజెన్సీలకు కలెక్టర్ హిమాన్షూ శుక్లా నోటీసులు జారీ చేశారు. 399 ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు సమాచారం.

News March 24, 2026

నెల్లూరు జిల్లాలో కొత్త MLA సీట్లు ఇవేనా..?

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజనతో <<19461748>>MLAల సంఖ్య <<>>10 నుంచి 15కి పెరిగే అవకాశం ఉంది. 2009కి ముందు రాపూరు, అల్లూరు నియోజకవర్గాలు ఉండేవి. వీటిని పునరుద్ధరించే అవకాశం ఉంది. 8మండలాలతో ఉదయగిరి, 6మండలాలతో సూళ్లూరుపేట, ఆత్మకూరు పెద్ద నియోజకవర్గాలుగా ఉన్నాయి. వీటి విభజనతో కొత్తది ఏర్పడవచ్చు. ఓట్ల పరంగా నెల్లూరు సిటీ, రూరల్‌తో పాటు మరోక నియోజకవర్గం ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.

News March 24, 2026

నెల్లూరు జిల్లాలో పెరగనున్న MLA సీట్లు..!

image

ఏపీలో MLA, MP స్థానాలు <<19460921>>పెంపుపై <<>>కేంద్రం చర్చలు జరుపుతోంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు పెడతారని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనూ సీట్ల సంఖ్య 50శాతం పెరగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 10 MLA సీట్లు 15కు పెరిగే అవకాశం ఉంది. నెల్లూరు ఎంపీతో పాటు కొన్ని నియోజకవర్గాలు తిరుపతి పార్లమెంట్ కింద ఉన్నాయి. కొత్త బిల్లుతో జిల్లాలోనే 2 ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉంది.