News June 18, 2024

మంత్రి కోసం పవన్ కళ్యాణ్ ఛాంబర్ మార్పు

image

AP: రేపు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న పవన్ కళ్యాణ్ ఛాంబర్‌ను మార్చారు. తొలుత సచివాలయంలోని 212, 214 రూమ్‌లను కేటాయించగా ఆ గదులు తనకు కావాలని మంత్రి పయ్యావుల కేశవ్ అడిగినట్లు సమాచారం. దీంతో పవన్ కోసం 211 రూమ్‌ను సిద్ధం చేశారు. కాసేపట్లో ఆయన ఛాంబర్‌ను పరిశీలించనున్నారు. రేపు ఇక్కడే పవన్ బాధ్యతలు చేపట్టనున్నారు.

Similar News

News February 3, 2025

SHOCKING: సీఎం చంద్రబాబు భూమి స్వాహాకు యత్నం!

image

AP: భూమాఫియా బరితెగించింది. ఏకంగా CM చంద్రబాబు స్థలంపైనే కన్నువేసింది. 25 ఏళ్ల కిందట బాపట్లలో TDP ఆఫీస్ కోసం ఓ వ్యక్తి CBN పేరిట 9.5 సెంట్లు రిజిస్టర్ చేయించారు. కాలక్రమంలో దీని విలువ రూ.1.50 కోట్లకు చేరడంతో అక్రమార్కులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. తాజాగా ఆ పత్రాలతో బ్యాంకు రుణం కోసం ప్రయత్నించగా మోసం బయటపడింది. బాపట్ల MLA ఫిర్యాదుతో సత్తార్‌రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

News February 3, 2025

కచిడి చేప@3.95 లక్షలు

image

AP: కాకినాడ వద్ద సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులను అదృష్టం వరించింది. అరుదైన కచిడి చేప వారికి కాసులు కురిపించింది. 25KGల చేప వేలంలో రూ.3.95 లక్షలు పలికింది. దీని శాస్త్రీయ నామం ప్రొటోనిబియా డయాకాన్తస్. కుట్లు వేసేందుకు వాడే దారాన్ని ఈ చేప పొట్ట భాగం నుంచే తయారు చేస్తారు. సౌందర్య సాధనాల తయారీలో వినియోగిస్తారు. ఖరీదైన వైన్లను శుభ్రం చేయడానికి ఈ చేప రెక్కలను వాడతారు. అందుకే ఈ ఫిష్‌కు డిమాండ్.

News February 3, 2025

రాష్ట్రంలో పెరిగిన ఉష్ణోగ్రతలు

image

TG: రాష్ట్రవ్యాప్తంగా సాధారణ పగటి ఉష్ణోగ్రతలు 2-6 డిగ్రీల వరకు పెరిగినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అన్ని జిల్లాల్లో 30 డిగ్రీలకు పైగా నమోదైనట్లు తెలిపింది. ఆదిలాబాద్ 36.5°C, మహబూబ్‌నగర్ 36.1°C, భద్రాద్రి 35.6°C, మెదక్ 34.8, నిజామాబాద్ 34.5, ఖమ్మం 34.6, హనుమకొండ 34, హైదరాబాద్ 34, నల్గొండ‌లో 31.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయినట్లు పేర్కొంది. వచ్చే వారం కూడా వాతావరణం ఇలాగే ఉంటుందని వివరించింది.