News June 18, 2024
ట్వీట్ డిలీట్ చేయాలని విద్యుత్ శాఖ సిబ్బంది ఇంటికొచ్చారు: నెటిజన్
‘పవర్ కట్’ అయిందని ట్విటర్ వేదికగా కంప్లైంట్ చేస్తే అధికారులు ఇంటికి వచ్చి ట్వీట్ డిలీట్ చేయాలని చెబుతున్నారని ఓ నెటిజన్ Xలో చేసిన పోస్ట్ వైరలవుతోంది. ‘గతంలో పవర్ కట్ గురించి కంప్లైంట్ చేశాను. అప్పుడు USC, మొబైల్ నంబర్ ఇచ్చాను. సిబ్బంది ఇప్పుడు ఇంటికి వచ్చి ప్రాబ్లమ్ సాల్వ్ అయింది కాబట్టి ట్వీట్ డిలీట్ చేయండని అడిగారు. ఉన్నత అధికారుల నుంచి ఒత్తిడి ఉందని చెప్పారు’ అని ట్వీట్ చేశారు.
Similar News
News February 3, 2025
అంగన్వాడీ పిల్లలకు మిల్క్, మిల్లెట్ స్నాక్స్!
TG: అంగన్వాడీలకు వచ్చే 3-5 ఏళ్ల పిల్లలకు మరింత క్వాలిటీ ఫుడ్ అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం వారికి ఒక పూట భోజనం, గుడ్డు, కుర్‌కురే స్నాక్స్ ఇస్తోంది. కుర్‌కురేకు బదులుగా ఓ గ్లాసు పాలు, మిల్లెట్స్‌తో చేసిన స్నాక్స్ ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. పిల్లలకు ఏ మిల్లెట్స్ మంచివి? వారికి సులభంగా జీర్ణమయ్యేలా ఎలా తయారుచేయాలి? అనే దానిపై నిపుణుల సలహాలు తీసుకోనుంది.
News February 3, 2025
చేనేత కార్మికులకు గుడ్ న్యూస్
TG: నేత కార్మికులకు ‘వర్కర్ టు ఓనర్’ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. గతంలో నిర్మించిన వీవింగ్ షెడ్లలో పవర్ లూమ్స్ బిగించి లబ్ధిదారులకు ఇవ్వనుంది. త్వరలోనే అర్హులను గుర్తించి తొలుత సిరిసిల్ల జిల్లాలో అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఒక యూనిట్ కింద ₹8L విలువైన 4 లూమ్స్ ఇస్తారు. యూనిట్ విలువలో 50% సబ్సిడీ, 40% బ్యాంక్ లోన్, 10% లబ్ధిదారుడు చెల్లించాల్సి ఉంటుందని సమాచారం.
News February 3, 2025
RG Kar మెడికల్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య
వైద్య విద్యార్థినిపై హత్యాచార ఘటనతో వార్తల్లో నిలిచిన కోల్‌కతాలోని RG Kar మెడికల్ కాలేజీలో మరో దుర్ఘటన జరిగింది. అక్కడి ESI క్వార్టర్స్‌లో MBBS విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. రాత్రి తలుపు తీయకపోవడంతో తల్లి డోర్‌ను తోసుకుని లోపలికి వెళ్లగా ఆమె ఉరికి వేలాడుతూ కనిపించింది. ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. రూమ్‌లో సూసైడ్ నోట్ లేదని, డిప్రెషన్ కారణంగా చనిపోయి ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు.