News June 18, 2024

2500 ఏళ్ల క్రితం దారి మార్చుకున్న గంగానది!

image

సుమారు 2500 ఏళ్ల క్రితం వచ్చిన భూకంపం కారణంగా గంగానది తన ప్రవాహ దిశను మార్చుకుందని అమెరికా పరిశోధకులు తాజాగా అంచనా వేశారు. హిమాలయాల్లో ప్రారంభమయ్యే గంగ, భారత్‌, బంగ్లాదేశ్ మీదుగా బంగాళాఖాతంలో కలుస్తుంది. అయితే వేల ఏళ్ల క్రితం.. బంగ్లా ప్రస్తుత రాజధాని ఢాకా ప్రాంతానికి దక్షిణంగా సుమారు 100 కిమీ దూరంలో గంగమ్మ ప్రవహించేదని, భూకంపం అనంతరం ఇప్పుడున్న దిశలోకి మారిందని పరిశోధకులు వివరించారు.

Similar News

News March 28, 2026

కృష్ణా: పదో తరగతి బయోలాజికల్ సైన్స్ పరీక్ష ప్రశాంతం

image

పదో తరగతి పరీక్షల్లో భాగంగా శనివారం బయోలాజికల్ సైన్స్ పరీక్ష నిర్వహించారు. జిల్లాలోని 148 కేంద్రాల్లో పరీక్ష ప్రశాంతంగా జరిగిందని డీఈవో యూవీ సుబ్బారావు తెలిపారు. 21,716 మంది విద్యార్థులకు గాను 21,408 మంది హాజరయ్యారన్నారు. 308 మంది గైర్హాజరు కాగా హాజరు శాతం 98.18% నమోదైందన్నారు. డీఈవోగా తాను 4 కేంద్రాలను తనిఖీ చేయగా ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ 32 కేంద్రాలను తనిఖీ చేశాయన్నారు.

News March 28, 2026

మోదీ-ట్రంప్ కాల్‌లో ఎలాన్ మస్క్ లేరు: కేంద్రం

image

ప్రధాని మోదీ, US ప్రెసిడెంట్ ట్రంప్ మధ్య జరిగిన ఫోన్ కాల్‌లో ఎలాన్ మస్క్ పాల్గొన్నట్లు వచ్చిన వార్తలను కేంద్ర విదేశాంగ శాఖ ప్రతినిధి ఖండించారు. ఈ నెల 24న మోదీ, ట్రంప్ మధ్య మాత్రమే టెలిఫోన్ సంభాషణ జరిగిందని స్పష్టం చేశారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై వారు మాట్లాడుకున్నారని తెలిపారు.

News March 28, 2026

కామరాజర్ పోర్టులో ఉద్యోగాలు.. దరఖాస్తుకు నేడే ఆఖరు తేదీ

image

చెన్నైలోని కామరాజర్ పోర్టు 14 జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. ఏదైనా డిగ్రీ, బీకామ్ అర్హత గలవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష(CBT), DV, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.25,250-రూ.50,500 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://kpl.cbtexam.in