News June 18, 2024
HYD: పూర్తి స్థాయిలో ఎమర్జెన్సీ పంపింగ్‌కు రెడీ

ఎత్తిపోతల ద్వారా HYD నగరానికి గోదావరి జలాల తరలింపు ప్రక్రియ మొదలుకానుంది. బుధవారం నుంచి ఎల్లంపల్లి రిజర్వాయర్ నుంచి అత్యవసర పంపింగ్‌తో నగరానికి రోజూ 168 ఎంజీడీల వాటర్‌ను తరలించనున్నారు. ఈ సందర్భంగా ఏడు పంపులను అధికారులు సిద్ధం చేసి ట్రయల్ రన్ పూర్తి చేశారు. బుధవారం నుంచి పూర్తి స్థాయిలో ఎమర్జెన్సీ పంపింగ్‌కు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
Similar News
News March 6, 2026
HYD: మీ గుడి నుంచి పూజలు.. రూ.50 వేల ఆదాయం

ప్రముఖ ఆధ్యాత్మిక ప్లాట్‌ఫాం వేదమందిర్‌కు సేవలందించేందుకు పురోహితులు కావలెను. మీ ప్రాంతంలోనే ఉండి, మీ దైనందిన కార్యక్రమాలు చూసుకుంటూనే మా కస్టమర్లకు సేవలు అందించవచ్చు. దీంతో మీరు నెలకు రూ.40వేల నుంచి రూ.50 వేల వరకు పొందుతారు. ఆసక్తి గల పురోహితులు <
News March 6, 2026
HYD: నీరు వృథా.. ఖజానా ఖాళీ!

జలమండలిని ఇప్పుడు ‘నాన్-రెవెన్యూ వాటర్’ (NRW) భూతం వేధిస్తోంది. నగరానికి సరఫరా అవుతున్న నీటిలో దాదాపు 40% లీకేజీలు, అక్రమ కనెక్షన్ల ద్వారా వృథా అవుతుండటంతో బోర్డు దివాలా తీసే స్థితికి చేరింది. అటు సుంకేసుల ఇన్-టేక్ వెల్ వద్ద సాంకేతిక సమస్యల భయం వెంటాడుతుంటే ఇటు కొండాపూర్, శేరిలింగంపల్లి వంటి ప్రాంతాల్లో తాగునీటిలో మురుగు కలుస్తోందన్న ఫిర్యాదులు కలకలం రేపుతున్నాయి.
News March 5, 2026
HYDలో ఇక ‘RED’ నోటీసులు

ఆర్థిక కష్టాల్లో ఉన్న జీహెచ్‌ఎంసీ ఇప్పుడు ట్యాక్స్ బాకీదార్లపై కన్నెర్ర చేస్తోంది. ₹3,000 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలు పేరుకుపోవడంతో ‘రెడ్ నోటీసుల’ పర్వం మొదలైంది. గడువు దాటితే సెక్షన్ 269 ప్రయోగించి ఆస్తుల జప్తుకు అధికారులు సిద్ధమవుతున్నారు. విడ్డూరమేంటంటే.. ప్రభుత్వ భవనాలే వెయ్యి కోట్ల బకాయి ఉండటం. ఈ నిధులు రాకపోతే వరద నివారణ, రోడ్ల మరమ్మతు పనులు గంగలో కలవడం ఖాయమనే విమర్శలొస్తున్నాయి.


