News June 18, 2024

కేసీఆర్ తొందరపాటు వల్ల రూ.81వేల కోట్ల అప్పు: కోదండరాం

image

TG: గత ప్రభుత్వంలో తీసుకున్న అన్ని నిర్ణయాలను BRS సమర్థించుకునే ప్రయత్నం చేస్తోందని ప్రొ.కోదండరాం మండిపడ్డారు. గతేడాది వచ్చిన వరదలకు భద్రాద్రి ప్లాంట్‌లో ఉత్పత్తి ఆపేయాల్సి వచ్చిందని, నీటిమట్టం పెరిగితే ప్లాంట్‌ను కాపాడుకోలేమన్నారు. KCR సర్కార్ తొందరపాటు వల్ల ట్రాన్స్‌కో, జెన్‌కోలు రూ.81వేల కోట్ల అప్పులయ్యాయని జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను కలిసిన సందర్భంగా కోదండరాం చెప్పారు.

Similar News

News February 3, 2025

డిగ్రీ అర్హత.. భారీ జీతంతో 1,000 ఉద్యోగాలు

image

ముంబైలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1,000 క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 20వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. 60 శాతం మార్కులతో డిగ్రీ పాసై, 20-30 ఏళ్ల వయసున్నవారు అర్హులు. రిజర్వేషన్ బట్టి సడలింపు ఉంటుంది. ఆన్‌లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. పే స్కేల్ నెలకు రూ.48,480-రూ.85,920 ఉంటుంది.
వెబ్‌సైట్: <>https://www.centralbankofindia.co.in/<<>>

News February 3, 2025

అంగన్వాడీ పిల్లలకు మిల్క్, మిల్లెట్ స్నాక్స్!

image

TG: అంగన్వాడీలకు వచ్చే 3-5 ఏళ్ల పిల్లలకు మరింత క్వాలిటీ ఫుడ్ అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం వారికి ఒక పూట భోజనం, గుడ్డు, కుర్‌కురే స్నాక్స్ ఇస్తోంది. కుర్‌కురేకు బదులుగా ఓ గ్లాసు పాలు, మిల్లెట్స్‌తో చేసిన స్నాక్స్ ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. పిల్లలకు ఏ మిల్లెట్స్ మంచివి? వారికి సులభంగా జీర్ణమయ్యేలా ఎలా తయారుచేయాలి? అనే దానిపై నిపుణుల సలహాలు తీసుకోనుంది.

News February 3, 2025

చేనేత కార్మికులకు గుడ్ న్యూస్

image

TG: నేత కార్మికులకు ‘వర్కర్ టు ఓనర్’ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. గతంలో నిర్మించిన వీవింగ్ షెడ్లలో పవర్ లూమ్స్ బిగించి లబ్ధిదారులకు ఇవ్వనుంది. త్వరలోనే అర్హులను గుర్తించి తొలుత సిరిసిల్ల జిల్లాలో అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఒక యూనిట్ కింద ₹8L విలువైన 4 లూమ్స్ ఇస్తారు. యూనిట్ విలువలో 50% సబ్సిడీ, 40% బ్యాంక్ లోన్, 10% లబ్ధిదారుడు చెల్లించాల్సి ఉంటుందని సమాచారం.