News June 18, 2024

మార్కెట్‌లో హాట్ కేక్‌లా మారిన ‘దేవర’!

image

అల్లు అర్జున్ నటిస్తోన్న ‘పుష్ప-2’ సినిమా రిలీజ్ వాయిదా పడటంతో అందరి దృష్టి ఎన్టీఆర్ ‘దేవర’పై పడింది. ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో రాబోతున్న ‘కల్కి’ రిలీజ్ తర్వాత వచ్చే స్టార్ హీరో సినిమా ‘దేవర’ ఒకటే. దీంతో సెప్టెంబర్ 17న రిలీజయ్యే ఈ మూవీ ఫిల్మ్ మార్కెట్‌లో హాట్ కేక్‌లా మారిందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ‘పుష్ప-2’ AUG 15న రిలీజ్ కావాల్సి ఉండగా షూటింగ్ పూర్తికాకపోవడంతో పోస్ట్ పోన్ అయింది.

Similar News

News November 13, 2025

‘పీక్ కోల్డ్‌వేవ్’: తెలంగాణపై చలి పంజా!

image

రాష్ట్రంలో చలి తీవ్రత విపరీతంగా పెరుగుతోంది. ఈరోజు నుంచి ‘పీక్ కోల్డ్‌వేవ్’ పరిస్థితులు ప్రారంభం కానున్నాయి. రాత్రి, ఉదయం వేళల్లో ఉష్ణోగ్రతలు 10°C-8°C వరకు పడిపోయే అవకాశం ఉంది. ఈనెల 18 వరకు ఇది కొనసాగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్‌లోనూ టెంపరేచర్ 13°C-11°Cకి పడిపోతుందని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరిగా వెచ్చని దుస్తులు ధరించాలని హెచ్చరిస్తున్నారు.

News November 13, 2025

నేటి నుంచి టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపు

image

AP: నేటి నుంచి ఈ నెల 25 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా టెన్త్ పరీక్షల ఫీజులు చెల్లించవచ్చని విద్యాశాఖ అధికారులు తెలిపారు. నవంబర్ 26 నుంచి డిసెంబర్ 3 వరకు రూ.50, డిసెంబర్ 10 వరకు రూ.200, డిసెంబర్ 15 వరకు రూ.500 లేట్ ఫీజుతో చెల్లించవచ్చని వెల్లడించారు. ఫీజును https://bse.ap.gov.in‌లో స్కూల్ లాగిన్ ద్వారా మాత్రమే చెల్లించాలన్నారు. గడువు పొడిగింపు ఉండబోదని స్పష్టంచేశారు.

News November 13, 2025

కొబ్బరి సాగు.. భూమిని బట్టి నీరివ్వాలి

image

కొబ్బరి తోటలను నల్ల భూముల్లో పెంచుతుంటే 20 రోజులకు ఒకసారి, తేలికపాటి ఎర్రభూముల్లో సాగు చేస్తుంటే 10 రోజులకు ఒకసారి తప్పకుండా నీటిని అందించాలి. తేలిక భూముల్లో అయితే వేసవి కాలంలో 5 నుంచి 7 రోజులకు ఒకసారి నీటి తడులు అందించాలి. కొబ్బరి తోటలు నీటి ఎద్దడికి గురికాకుండా జాగ్రత్త పడాలి. తోటల్లో నీటి ఎద్దడి వల్ల కొబ్బరిలో పిందెరాలడం, కాయ పరిమాణం తగ్గడం వంటి సమస్యలు తలెత్తి పంట దిగుబడి తగ్గుతుంది.