News June 18, 2024

శరద్ పవార్‌ను కలిసిన TMC ఎంపీలు

image

NCP(SP) అధినేత శరద్ పవార్‌ను TMC MPల బృందం కలిసింది. స్టాక్ మార్కెట్ మేనిపులేషన్‌పై విచారణ జరిపించాలనే వారి డిమాండ్‌కు పవార్ మద్దతిచ్చారు. తప్పుడు ఎగ్జిట్ పోల్స్‌తో మోదీ, అమిత్ షా స్టాక్ మార్కెట్‌ను మేనిపులేట్ చేశారని TMC అధినేత్రి, WB CM మమత ఆరోపిస్తున్నారు. BJP ‘బిగ్గెస్ట్ స్టాక్ మార్కెట్ స్కామ్’కు పాల్పడటంతో ఇన్వెస్టర్లు రూ.30లక్షల కోట్లు నష్టపోయినట్లు రాహుల్ సైతం ఆరోపణలు గుప్పించారు.

Similar News

News February 3, 2025

కచిడి చేప@3.95 లక్షలు

image

AP: కాకినాడ వద్ద సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులను అదృష్టం వరించింది. అరుదైన కచిడి చేప వారికి కాసులు కురిపించింది. 25KGల చేప వేలంలో రూ.3.95 లక్షలు పలికింది. దీని శాస్త్రీయ నామం ప్రొటోనిబియా డయాకాన్తస్. కుట్లు వేసేందుకు వాడే దారాన్ని ఈ చేప పొట్ట భాగం నుంచే తయారు చేస్తారు. సౌందర్య సాధనాల తయారీలో వినియోగిస్తారు. ఖరీదైన వైన్లను శుభ్రం చేయడానికి ఈ చేప రెక్కలను వాడతారు. అందుకే ఈ ఫిష్‌కు డిమాండ్.

News February 3, 2025

రాష్ట్రంలో పెరిగిన ఉష్ణోగ్రతలు

image

TG: రాష్ట్రవ్యాప్తంగా సాధారణ పగటి ఉష్ణోగ్రతలు 2-6 డిగ్రీల వరకు పెరిగినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అన్ని జిల్లాల్లో 30 డిగ్రీలకు పైగా నమోదైనట్లు తెలిపింది. ఆదిలాబాద్ 36.5°C, మహబూబ్‌నగర్ 36.1°C, భద్రాద్రి 35.6°C, మెదక్ 34.8, నిజామాబాద్ 34.5, ఖమ్మం 34.6, హనుమకొండ 34, హైదరాబాద్ 34, నల్గొండ‌లో 31.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయినట్లు పేర్కొంది. వచ్చే వారం కూడా వాతావరణం ఇలాగే ఉంటుందని వివరించింది.

News February 3, 2025

డిగ్రీ అర్హత.. భారీ జీతంతో 1,000 ఉద్యోగాలు

image

ముంబైలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1,000 క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 20వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. 60 శాతం మార్కులతో డిగ్రీ పాసై, 20-30 ఏళ్ల వయసున్నవారు అర్హులు. రిజర్వేషన్ బట్టి సడలింపు ఉంటుంది. ఆన్‌లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. పే స్కేల్ నెలకు రూ.48,480-రూ.85,920 ఉంటుంది.
వెబ్‌సైట్: <>https://www.centralbankofindia.co.in/<<>>