News June 18, 2024
ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తాం: ఎస్పీ శరత్ చంద్ర పవర్

నల్లగొండ జిల్లాలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తామని నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. మంగళవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం వారు మాట్లాడుతూ.. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయడంతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. మహిళల రక్షణకు పెద్ద పీట వేస్తామని, వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పమన్నారు.
Similar News
News November 12, 2025
నల్గొండకు మరో అరుదైన గౌరవం

ప్రాంతీయ అభివృద్ధికి సైన్స్ అండ్ టెక్నాలజీ (S&T) ఆధారిత పరిష్కారాలను రూపొందించడంలో చురుకుగా ఉన్న నల్గొండ జిల్లా యంత్రాంగానికి అరుదైన ఆహ్వానం లభించింది. కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు (PSA) కార్యాలయం ఢిల్లీలో డిసెంబర్‌లో నిర్వహించే అంతర్జాతీయ సదస్సుకు హాజరు కావాలని జిల్లా యంత్రాంగాన్ని కోరారు. ‘S&T క్లస్టర్స్: మేకింగ్ లైవ్స్ ఈజియర్’ అంశంపై జరిగే ఈ సదస్సు ఆహ్వానం కలెక్టర్‌కు అందింది.
News November 12, 2025
NLG: ఆ సంచి ప్రచారానికేనా..!

రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు అందిస్తున్న ప్లాస్టిక్ రహిత సంచులు ప్రచారానికే తప్ప బియ్యం తీసుకెళ్లేందుకు పనికిరావడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సంచుల కొలతలు, పోర్టబిలిటీ, బయోమెట్రిక్ నిబంధనలపై రేషన్ డీలర్లు, కార్డుదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 4,66,100 రేషన్ కార్డులు ఉన్నాయి. అయితే ఈ సంచులు కేవలం 12 కిలోల బియ్యం మాత్రమే తీసుకెళ్లేలా రూపొందించారు.
News November 12, 2025
NLG: ఆశల సాగులో రైతన్న.. యాసంగికి సిద్ధం

ఆశల సాగులో రైతన్న కొట్టుమిట్టాడుతున్నాడు. ఒకసారి కాకుంటే మరో సారి కాలం కలిసి రాదా అనే ఆశతో నల్గొండ జిల్లాలో రైతన్న యాసంగి సాగుకు సిద్ధమవుతున్నాడు. వానకాలంలో అధిక వర్షాలు నిండా ముంచాయి. పత్తి, వరి తదితర పంటలు దెబ్బతిని రైతులు నష్టాలు చవిచూశారు. వానకాలం నష్టాలు మిగిల్చినా యాసంగికైనా కలిసొస్తుందేమో అనే ఆశతో సాగుకు సన్నద్ధమవుతున్నాడు.


