News June 18, 2024

లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ తల్లిదే కీలకపాత్ర: సిట్

image

లైంగిక వేధింపుల బాధితురాలి అపహరణలో ప్రజ్వల్ రేవణ్ణ తల్లి భవానీదే కీలకపాత్ర అని కర్ణాటక హైకోర్టుకు సిట్ తెలిపింది. ఫిర్యాదు చేయకుండా ఉండేందుకు బాధితులను మేనేజ్ చేయాలనుకుందని పేర్కొంది. విచారణను ఆమె తప్పుదోవ పట్టిస్తున్నారని, ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కోరింది. అయితే ఆమె పోలీసులకు అన్నివిధాలుగా సహకరిస్తున్నారని భవానీ తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. దీంతో ఆమెకు ధర్మాసనం ముందస్తు బెయిల్ ఇచ్చింది.

Similar News

News February 3, 2025

రాష్ట్రంలో పెరిగిన ఉష్ణోగ్రతలు

image

TG: రాష్ట్రవ్యాప్తంగా సాధారణ పగటి ఉష్ణోగ్రతలు 2-6 డిగ్రీల వరకు పెరిగినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అన్ని జిల్లాల్లో 30 డిగ్రీలకు పైగా నమోదైనట్లు తెలిపింది. ఆదిలాబాద్ 36.5°C, మహబూబ్‌నగర్ 36.1°C, భద్రాద్రి 35.6°C, మెదక్ 34.8, నిజామాబాద్ 34.5, ఖమ్మం 34.6, హనుమకొండ 34, హైదరాబాద్ 34, నల్గొండ‌లో 31.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయినట్లు పేర్కొంది. వచ్చే వారం కూడా వాతావరణం ఇలాగే ఉంటుందని వివరించింది.

News February 3, 2025

డిగ్రీ అర్హత.. భారీ జీతంతో 1,000 ఉద్యోగాలు

image

ముంబైలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1,000 క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 20వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. 60 శాతం మార్కులతో డిగ్రీ పాసై, 20-30 ఏళ్ల వయసున్నవారు అర్హులు. రిజర్వేషన్ బట్టి సడలింపు ఉంటుంది. ఆన్‌లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. పే స్కేల్ నెలకు రూ.48,480-రూ.85,920 ఉంటుంది.
వెబ్‌సైట్: <>https://www.centralbankofindia.co.in/<<>>

News February 3, 2025

అంగన్వాడీ పిల్లలకు మిల్క్, మిల్లెట్ స్నాక్స్!

image

TG: అంగన్వాడీలకు వచ్చే 3-5 ఏళ్ల పిల్లలకు మరింత క్వాలిటీ ఫుడ్ అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం వారికి ఒక పూట భోజనం, గుడ్డు, కుర్‌కురే స్నాక్స్ ఇస్తోంది. కుర్‌కురేకు బదులుగా ఓ గ్లాసు పాలు, మిల్లెట్స్‌తో చేసిన స్నాక్స్ ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. పిల్లలకు ఏ మిల్లెట్స్ మంచివి? వారికి సులభంగా జీర్ణమయ్యేలా ఎలా తయారుచేయాలి? అనే దానిపై నిపుణుల సలహాలు తీసుకోనుంది.