News June 18, 2024

సూపర్-8లో ఏదైనా ప్రత్యేకంగా చేస్తాం: రోహిత్ శర్మ

image

T20 WCలో సూపర్-8 దశలో ఏదైనా ప్రత్యేకంగా చేస్తామని భారత కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. ‘జట్టులో సభ్యులందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. సూపర్-8 షెడ్యూల్ కొంచెం టైట్ ఉన్నా ఈస్థాయిలో అలా ఆడేందుకు అలవాటుపడి ఉన్నాం. మా నైపుణ్యాలకు మరింత పదును పెట్టడంపై దృష్టి సారించాం. ఎప్పుడెప్పుడు ఆడదామా అని ఎదురుచూస్తున్నాం’ అని వెల్లడించారు. భారత్ ఈ నెల 20 అఫ్గాన్‌తో, 22న బంగ్లాదేశ్‌తో, 24న ఆస్ట్రేలియాతో తలపడనుంది.

Similar News

News February 3, 2025

కచిడి చేప@3.95 లక్షలు

image

AP: కాకినాడ వద్ద సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులను అదృష్టం వరించింది. అరుదైన కచిడి చేప వారికి కాసులు కురిపించింది. 25KGల చేప వేలంలో రూ.3.95 లక్షలు పలికింది. దీని శాస్త్రీయ నామం ప్రొటోనిబియా డయాకాన్తస్. కుట్లు వేసేందుకు వాడే దారాన్ని ఈ చేప పొట్ట భాగం నుంచే తయారు చేస్తారు. సౌందర్య సాధనాల తయారీలో వినియోగిస్తారు. ఖరీదైన వైన్లను శుభ్రం చేయడానికి ఈ చేప రెక్కలను వాడతారు. అందుకే ఈ ఫిష్‌కు డిమాండ్.

News February 3, 2025

రాష్ట్రంలో పెరిగిన ఉష్ణోగ్రతలు

image

TG: రాష్ట్రవ్యాప్తంగా సాధారణ పగటి ఉష్ణోగ్రతలు 2-6 డిగ్రీల వరకు పెరిగినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అన్ని జిల్లాల్లో 30 డిగ్రీలకు పైగా నమోదైనట్లు తెలిపింది. ఆదిలాబాద్ 36.5°C, మహబూబ్‌నగర్ 36.1°C, భద్రాద్రి 35.6°C, మెదక్ 34.8, నిజామాబాద్ 34.5, ఖమ్మం 34.6, హనుమకొండ 34, హైదరాబాద్ 34, నల్గొండ‌లో 31.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయినట్లు పేర్కొంది. వచ్చే వారం కూడా వాతావరణం ఇలాగే ఉంటుందని వివరించింది.

News February 3, 2025

డిగ్రీ అర్హత.. భారీ జీతంతో 1,000 ఉద్యోగాలు

image

ముంబైలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1,000 క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 20వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. 60 శాతం మార్కులతో డిగ్రీ పాసై, 20-30 ఏళ్ల వయసున్నవారు అర్హులు. రిజర్వేషన్ బట్టి సడలింపు ఉంటుంది. ఆన్‌లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. పే స్కేల్ నెలకు రూ.48,480-రూ.85,920 ఉంటుంది.
వెబ్‌సైట్: <>https://www.centralbankofindia.co.in/<<>>