News June 18, 2024
రూ.2,324 కోట్లతో ఐటీఐల ఆధునికీకరణ: CM రేవంత్

TG: రాష్ట్రంలోని 65 ఐటీఐలను అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లు(ATC)గా అప్‌గ్రేడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.2,324 కోట్లు ఖర్చు చేయన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇవాళ మల్లేపల్లి ఐటీఐలో ఏటీసీలకు ఆయన శంకుస్థాపన చేశారు. కాగా పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ ఇచ్చేందుకు 130 మంది నిపుణులను నియమించనున్నట్లు ప్రభుత్వం వర్గాలు తెలిపాయి.
Similar News
News March 6, 2026
లక్ష మందికి ఉగాది కానుక!

AP: ఉగాది పండుగ పురస్కరించుకొని లక్ష మందికి ఈ నెల 18వ తేదీన టిడ్కో ఇళ్లు అందజేయనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. జూన్ నాటికి మిగతా టిడ్కో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని వెల్లడించారు. అటు 2028 కల్లా పట్టణ ప్రజలందరికీ సురక్షితమైన తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇక TDR బాండ్ల జారీలో గత ప్రభుత్వం వందల రూ.కోట్ల అక్రమాలకు పాల్పడిందని, దీనిపై విజిలెన్స్ విచారణ జరుగుతోందన్నారు.
News March 6, 2026
ముందు ఇరాన్.. తర్వాత క్యూబా: ట్రంప్

ఇరాన్‌పై విరుచుకుపడుతున్న ట్రంప్ తన నెక్స్ట్ టార్గెట్ వెల్లడించారు. ఇరాన్‌పై పోరుపై దృష్టిపెట్టానని.. అది అయిపోయాక త్వరలోనే క్యూబా సంగతి చూస్తానని వైట్ హౌస్‌లోని ఓ ఈవెంట్‌లో తెలిపారు. అమెరికాతో డీల్ చేసుకునేందుకు క్యూబా ఎంతో ఉత్సాహంగా ఉందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే అమెరికా క్యూబాపై ఆంక్షలు విధించింది. కాగా ఇటీవల <<19260435>>క్యూబాను<<>> అమెరికా స్నేహపూర్వకంగా దక్కించుకునే అవకాశం ఉందని ట్రంప్ చెప్పుకొచ్చారు.
News March 6, 2026
ఇరాన్‌పై US దాడులు.. ఏఐతో సెకన్లలో ప్లానింగ్!

US మిలిటరీకి AI కొత్త అస్త్రంగా మారింది. ఇరాన్‌పై దాడులు స్టార్ట్ చేసినప్పుడు 12 గంటల్లో 900కుపైగా లక్ష్యాలపై అటాక్ ఏఐతోనే సాధ్యమైంది. మేవెన్ స్మార్ట్ సిస్టమ్ 150కిపైగా సోర్సుల నుంచి రహస్య డేటా సేకరించి సెకన్లలో టార్గెట్స్ సెట్ చేసింది. సాధారణంగా ఈ ప్రక్రియకు కొన్నిరోజులు పడుతుంది. అయితే పాత డేటాతో తప్పుడు లక్ష్యాలపై దాడి జరిగే ప్రమాదం ఉంది. స్కూల్‌పై <<19288920>>దాడి<<>> అలాగే అయి ఉండొచ్చనే అనుమానాలు ఉన్నాయి.


