News June 18, 2024
జియో నెట్‌వర్క్ డౌన్!

దేశంలోని పలుచోట్ల జియో నెట్‌వర్క్ స్తంభించిపోయినట్లు తెలుస్తోంది. మొబైల్ నెట్‌వర్క్, ఇంటర్నెట్, ఫైబర్ వంటి సర్వీసులు నిలిచిపోయినట్లు యూజర్లు సోషల్ మీడియాలో ఫిర్యాదులు చేస్తున్నారు. డౌన్‌డిటెక్టర్ ప్రకారం మొబైల్ ఇంటర్నెట్ యూజర్లలో 54% మంది, ఫైబర్ యూజర్లలో 38%, సాధారణ నెట్‌వర్క్ యూజర్లలో 7% మంది ఈ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై కంపెనీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు.
Similar News
News March 6, 2026
శుభ సమయం (6-3-2026) శుక్రవారం

➤ తిథి: బహుళ తదియ సా.5.24 వరకు తదుపరి చవితి ➤ నక్షత్రం: హస్త ఉ.9.18 వరకు, తదుపరి చిత్త ➤ శుభ సమయాలు: ఉ.6.16-8.36, ఉ.10.11-11.10, మ.1.19-సా.4.04, సా.5.02-5.48 వరకు ➤ రాహుకాలం: ఉ.10.30-12.00 వరకు ➤ యమగండం: మ.3.00-4.30 వరకు ➤ దుర్ముహూర్తం: ఉ.8.37-9.24, మ.12.32-1.19 వరకు ➤ వర్జ్యం: సా.5.49-రా.7.32 వరకు ➤ అమృత ఘడియలు: తె.4.03 నుంచి 5.46 వరకు
News March 6, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 6, 2026
TODAY HEADLINES

* ఏ వివాదానికైనా సైనిక చర్య పరిష్కారం కాదు: PM
* BJP చేతికి బిహార్ పగ్గాలు.. RSకు నితీశ్
* WB గవర్నర్ బోస్, లద్దాక్ LG కవీందర్ రిజైన్
* ఇద్దరు, ఆపై సంతానానికి రూ.25,000: CBN
* జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వబోం: అయ్యన్న
* కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు: పవన్
* TG: రాజ్యసభకు సింఘ్వీ, నరేందర్ నామినేషన్
* TG: HYDలో రేవంత్ ఒక్క ఇల్లూ కట్టలేదు: KTR
* T20WC.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్


