News June 18, 2024
ఈ నెల 30 నుంచి ‘మన్ కీ బాత్’

ఈ నెల 30 నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ నిర్వహించనున్నారు. ఎన్నికల కారణంగా కొన్ని నెలలుగా ఈ కార్యక్రమం వాయిదా పడింది. ఇప్పుడు దీనిని పున:ప్రారంభించాలని ప్రధాని నిర్ణయించారు. కాగా మన్ కీ బాత్ ద్వారా మోదీ ప్రజలతో ఏదో ఒక రూపంలో నిరంతరం సంప్రదింపులు జరుపుతారు. ఈ కార్యక్రమం 2014 అక్టోబర్ 3న ప్రారంభించారు. ప్రతి నెలా చివరి ఆదివారం ఆకాశవాణి ద్వారా ఈ కార్యక్రమం కొనసాగుతోంది.
Similar News
News October 31, 2025
2018లోనే జెమీమా ప్రతిభను గుర్తించిన ENG మాజీ కెప్టెన్

మహిళల ప్రపంచకప్ సెమీఫైనల్‌లో అద్భుతంగా రాణించిన ఇండియన్ ఉమెన్ క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ పేరు మార్మోగుతోంది. అయితే ఈమె స్టార్‌గా ఎదుగుతారని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ 2018లో చేసిన ట్వీట్ ఇప్పుడు వైరలవుతోంది. ‘ఈ పేరు గుర్తుంచుకోండి.. జెమీమా రోడ్రిగ్స్. ఇండియాకు స్టార్‌గా మారుతుంది’ అని ఆయన ట్వీట్ చేశారు. ఈ అంచనా నిజమైందంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
News October 31, 2025
Asia Cup: ఒకట్రెండు రోజుల్లో భారత్‌కు ట్రోఫీ!

ఆసియా కప్ ట్రోఫీని ఒకట్రెండు రోజుల్లో ACC చీఫ్ నఖ్వీ అందజేసే అవకాశం ఉందని BCCI ఆశాభావం వ్యక్తం చేస్తోంది. నవంబర్ 4న ICC మీటింగ్ ఉండటంతో ఆ లోపు ఇస్తారని అంచనా వేస్తోంది. మరోవైపు నెల రోజులవుతున్నా ట్రోఫీని ఇవ్వకపోవడం సరి కాదని BCCI సెక్రటరీ సైకియా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకట్రెండు రోజుల్లో అది ముంబైలోని బీసీసీఐ ఆఫీసుకు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. లేదంటే ICC దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు.
News October 31, 2025
లోతట్టు ప్రాంతాల్లో ఇల్లు కట్టవచ్చా?

లోతట్టు ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోవడం ప్రమాదకరమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచించారు. ‘ఇలాంటి ప్రాంతాల్లో నిర్మించిన గృహాల్లోకి వర్షాకాలంలో నీరు వచ్చే అవకాశాలుంటాయి. ఇంట్లోకి తేమ చేరితే అనారోగ్యం వస్తుంది. లోతట్టు ప్రాంతాల్లో సౌరశక్తి, ప్రాణశక్తి కూడా తక్కువే. దీనివల్ల నివాసంలో నిరుత్సాహం ఏర్పడుతుంది. స్థిరమైన, సుఖమైన జీవనం కోసం ఎత్తుగా, సమతలంగా ఉండే ప్రదేశాన్ని ఎంచుకోవాలి’ అని తెలిపారు.<<-se>>#Vasthu<<>>


