News June 18, 2024
తాడిపత్రి బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి ప్రత్యేక గుర్తింపు

తాడిపత్రిలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈ ఆలయ గోపురాన్ని ఏపీ ప్రభుత్వం 10వ తరగతి పాఠ్యపుస్తకాలపై ముద్రించింది. ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం పెన్నానది ఒడ్డున వెలసింది. బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివలింగం కింద నుంచి జలధార ఊరుతూనే ఉండటం ఇక్కడి విశిష్టత. అలాగే శివలింగం మీద నేరుగా సూర్యకిరణాలు పడటం, ఆలయంలోని స్తంభాలను చేతులతో టచ్ చేస్తే సప్త స్వరాలు పలుకుతాయి.
Similar News
News July 6, 2025
గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధిత చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్

గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధిత చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని అధికారులను కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. అనంతపురంలోని కలెక్టరేట్‌లో శనివారం వివిధ శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కడా లింగ నిర్ధారణ పరీక్షలు చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు.
News July 5, 2025
గూగూడు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన డీఎస్పీ

నార్పల మండలం గూగూడు గ్రామంలో కుళ్లాయి స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అనంతపురం డీఎస్పీ వెంకటేశ్ శుక్రవారం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన క్యూ లైన్లు, అగ్నిగుండం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు, అవసరమైన చోట పోలీసు సిబ్బందిని కేటాయించారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఉంచామని చెప్పారు. అనంతరం స్వామిని దర్శించుకున్నారు.
News May 8, 2025
ATP: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

వర్షాల వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనంతపురం జిల్లా కలెక్టర్ సూచించారు. AP విపత్తుల సంస్థ సూచనల మేరకు జిల్లాలో వర్షాలు, పిడుగులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. AP విపత్తుల సంస్థ SMSలు, RTGS నుంచి సూచనలను తెలుపుతున్నామన్నారు. చెట్లు, టవర్స్, పోల్స్, పొలాలు, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదన్నారు. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలన్నారు.