News June 18, 2024

ప్రకృతి అందాల్లో మహానంది

image

దట్టమైన నల్లమల అడవుల్లో వెలిసిన మహానంది క్షేత్రం మహదానందానికి నిలయం. కొన్ని రోజులుగా వర్షాలు పడుతుండటంతో ఆలయ పరిసరాలు పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. భక్తులు నల్లమల అందాలు చూసి పరవశించిపోతున్నారు. ఆలయం వెనుకవైపు నల్లమల పచ్చగా కనిపిస్తూ పర్యాటకులను కనువిందు చేస్తోంది. పక్షుల కిలకిలారావాలు, నల్లమల పచ్చటి అందాలకు పొగమంచు తోడవడంతో మహానంది ఊటీ అందాలను తలపిస్తోందంటూ భక్తులు కామెంట్ చేస్తున్నారు.

Similar News

News January 9, 2026

రాష్ట్రంలోనే అత్యుత్తమ స్టేషన్‌గా పెద్దకడబూరు పీఎస్

image

పెద్దకడుబూరు పోలీస్‌స్టేషన్ రాష్ట్రంలోనే అత్యుత్తమ స్టేషన్‌గా ఎంపికైంది. శుక్రవారం మంగళగిరిలో డీజీపీ హారీశ్ కుమార్ గుప్తా నుంచి డీఐజీ విక్రాంత్ పాటిల్, డీఎస్పీ భార్గవి, ఎస్ఐ నిరంజన్ రెడ్డి ‘సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్సీ’ అవార్డు అందుకున్నారు. నేర నియంత్రణ, సీసీ కెమెరాల ఏర్పాటు, కేసుల సత్వర పరిష్కారంలో చూపిన ప్రతిభకు కేంద్ర హోం శాఖ ఈ గుర్తింపునిచ్చింది. ఈ ఘనత జిల్లాకే గర్వకారణమని డీఐజీ పేర్కొన్నారు.

News January 9, 2026

అధిక చార్జీలు వసూలు చేస్తే చర్యలు: డీటీసీ

image

సంక్రాంతి పండుగ వేళ ప్రైవేటు బస్సుల్లో అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ శాంత కుమారి హెచ్చరించారు. శుక్రవారం ఆమె బస్సు ఆపరేటర్లతో సమీక్ష నిర్వహించారు. ప్రతి బస్సులో హెల్ప్‌లైన్ నెంబర్ 9281607001 ప్రదర్శించాలని, రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ రెండో డ్రైవర్‌ను ఉంచుకోవాలని ఆమె ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై తనిఖీలు చేపడతామన్నారు.

News January 9, 2026

సచివాలయ సిబ్బందికి బయోమెట్రిక్ తప్పనిసరి: కలెక్టర్

image

గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ప్రతిరోజూ బయోమెట్రిక్ హాజరు తప్పనిసరిగా వేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. ఎంపీడీవోలు, సిబ్బందితో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడుతూ.. తక్కువ హాజరు శాతంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫీల్డ్‌కు వెళ్లే ముందే సచివాలయంలో హాజరు నమోదు చేయాలని స్పష్టం చేశారు. హాజరు ఉన్న రోజులకు మాత్రమే వేతనాలు చెల్లిస్తామని కలెక్టర్ హెచ్చరించారు.