News June 18, 2024
MGNREGA కూలీగా మారిన IRS అధికారి

100 రోజుల ఉపాధి హామీ పనిలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు కూలీగా మారారో IRS అధికారి. సూర్యపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన సందీప్ భాగ. బెంగళూరు జోన్‌లోని GST కార్యాలయంలో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల తన సొంతూరికి వచ్చిన ఆయన.. MGNREGA కార్మికుడిగా మారి రోజంతా ఎండలో పనిచేశారు. కొన్ని అనుభవాలు జీవితంపై చెరగని ప్రభావాన్ని చూపుతాయని ఆయన ఇన్‌స్టాలో ఫొటోలను పంచుకున్నారు.
Similar News
News September 15, 2025
కాంగ్రెస్‌తో పొత్తుకు తేజస్వీ బ్రేక్!

జాతీయ స్థాయిలో కూటమిగా ఉంటూ రాష్ట్ర ఎన్నికల్లో వేరుగా పోటీ చేసేందుకు ఇండీ కూటమి పార్టీలు మొగ్గు చూపుతున్నాయి. బిహార్‌లో ఉన్న 243 స్థానాల్లోనూ పోటీ చేస్తామని ఇండీ కూటమిలోని RJD ప్రకటించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీంతో తేజస్వీ కాంగ్రెస్‌తో పొత్తుకు బ్రేక్ ఇచ్చారా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. గతంలో పంజాబ్, హరియాణా ఎన్నికల్లో ఆప్, పశ్చిమబెంగాల్‌లో TMC ఒంటరిగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.
News September 15, 2025
గ్రామాల్లో మహిళా ఓటర్లే అత్యధికం: ఈసీ

TG: స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో గ్రామీణ జనాభా 1.95 కోట్లకు గానూ ఓటర్లు 1,67,03,168 మంది ఉన్నట్లు ఈసీ వెల్లడించింది. ఈ మేరకు 5,763 ఎంపీటీసీ స్థానాల పరిధిలో ఓటర్ల జాబితాలను వెల్లడించింది. వీరిలో మహిళా ఓటర్లు 85,35,935 మంది కాగా పురుషులు 81,66,732 మంది ఉన్నారని తెలిపింది. పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 4 లక్షలకుపైగా ఎక్కువని పేర్కొంది.
News September 15, 2025
దారుణం.. నిద్రిస్తున్న విద్యార్థుల కళ్లలో ఫెవిక్విక్

ఒడిశాలో ఓ హాస్టల్ విద్యార్థి చేసిన తుంటరి పని తోటి విద్యార్థులు ప్రాణాల మీదకు తెచ్చింది. కంధమాల్ జిల్లా సలాగూడలోని సెబాశ్రమ్ స్కూల్ హాస్టల్‌లో నిద్రిస్తున్న 8 మంది విద్యార్థుల కళ్లలో ఓ స్టూడెంట్ ఫెవిక్విక్ వేశాడు. ఈ ఘటనతో వారి కళ్లు మూసుకుపోయాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఒకరికి కళ్లు పూర్తిగా తెరుచుకోగా మిగతావారికి అలాగే ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.