News June 18, 2024

రైతుల ఖాతాల్లోకి డబ్బు.. PM కిసాన్ విడుదల

image

PM కిసాన్ పథకం కింద 17వ విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని వారణాసి వేదికగా ఆయన కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి నిధులు విడుదల చేశారు. ఈ విడతలో భాగంగా 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.20 వేల కోట్ల నిధులు జమ కానున్నాయి. అర్హులైన ప్రతి రైతు అకౌంట్లో రూ.2వేలు క్రెడిట్ అవుతాయి.

Similar News

News February 3, 2025

‘లక్కీ భాస్కర్’ తరహాలో డబ్బు సంపాదించాలనుకుని..

image

AP: లక్కీ భాస్కర్ మూవీలో హీరో బ్యాంకు సొమ్మును వాడుకుని మనీ సంపాదిస్తాడు. అదే తరహాలో చేయాలనుకుని ఓ ఉద్యోగి పోలీసులకు చిక్కాడు. మార్కాపురంలోని సచివాలయ కార్యదర్శి P.వెంకటేశ్వర్లు పింఛన్ల సొమ్ము ₹2.66L తీసుకుని JAN 31న పారిపోయాడు. వివిధ బెట్టింగ్ యాప్‌లలో పెట్టి ఒక్క రోజులోనే ₹10L సంపాదించాలనుకుని మొత్తం పోగొట్టుకున్నాడు. బంధువులు డబ్బు చెల్లించడంతో పోలీసులు అతడిని హెచ్చరించి వదిలేశారు.

News February 3, 2025

కుంభమేళాలో భక్తుల భద్రతపై నేడు సుప్రీంలో విచారణ

image

కుంభమేళాలో ఇటీవల జరిగిన తొక్కిసలాటపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇవాళ విచారించనుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గైడ్‌లైన్స్ ఇవ్వాలని పిటిషనర్ కోర్టును కోరారు. చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రత్యర్థులుగా పిటిషనర్ పేర్కొన్నారు.

News February 3, 2025

ప్రభుత్వ స్కూళ్లలో తగ్గుతున్న అడ్మిషన్లు.. సర్కార్ కీలక నిర్ణయం

image

TG: ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సర్కార్ విద్యాసంస్థల్లో అందిస్తున్న సౌకర్యాలు, వస్తున్న ఫలితాల గురించి ప్రజలకు తెలిసేలా వివరించనుంది. అడ్మిషన్లు పెరిగేలా చర్యలు చేపట్టనుంది. దీనికోసం FB, X, WHATSAPP వంటి సోషల్ మీడియా వేదికల్లో స్పెషల్ గ్రూపులను క్రియేట్ చేయనుంది. వీటిని స్పెషల్ ఆఫీసర్లు పర్యవేక్షిస్తారని సమాచారం.