News June 18, 2024
‘ఫ్లయింగ్ స్కూల్’కు ఎయిర్ ఇండియా శ్రీకారం
విమానయాన సంస్థ ఎయిర్‌ఇండియా ‘ఫ్లయింగ్ స్కూల్’కు శ్రీకారం చుడుతోంది. భవిష్యత్తులో పైలట్ల కొరత ఉంటుందనే ఉద్దేశంతో పైలట్లను తయారు చేసేందుకు మహారాష్ట్రలోని అమరావతి వేదికగా ట్రైనింగ్ సెంటర్ నెలకొల్పుతోంది. ఏడాదికి 180మందికి పైలట్ శిక్షణ ఇవ్వనుంది. అనుభవం లేకున్నా ఆసక్తి ఉన్నవారు ఇందులో ప్రవేశం పొందవచ్చట. ప్రస్తుతం ఇండిగో, స్పైస్‌జెట్ సంస్థలు ఇండియా, విదేశాల్లో ట్రైనింగ్ స్కూళ్లను నడిపిస్తున్నాయి.
Similar News
News January 18, 2025
శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఎప్పుడంటే?
AP: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 26న శివరాత్రి సందర్భంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఈవో శ్రీనివాసరావు ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్యం, ట్రాఫిక్, పార్కింగ్ వంటివాటిపై దృష్టి పెట్టాలని సూచించారు.
News January 18, 2025
మరో 63 అన్న క్యాంటీన్లు
AP: రాష్ట్రంలో కొత్తగా 63 అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. త్వరలోనే వీటి ఏర్పాటు, నిర్వహణకు టెండర్లు పిలవనున్నారు. ఏ ప్రాంతాల్లో ప్రారంభిస్తారనే విషయమై ఈ నెలఖారులోగా క్లారిటీ వచ్చే అవకాశముంది. కూటమి ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు 15న అన్న క్యాంటీన్లను ప్రారంభించగా ప్రస్తుతం 203 అందుబాటులో ఉన్నాయి.
News January 18, 2025
నేడు విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్
దేశవాళీ వన్డే ట్రోఫీ విజయ్ హజారే ఫైనల్ నేడు విదర్భ, కర్ణాటక జట్ల మధ్య జరగనుంది. విదర్భ కెప్టెన్ కరుణ్ నాయర్ భీకర ఫామ్‌లో ఉండగా ఆ జట్టు తొలిసారి టైటిల్ గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ఐదో సారి VHTని ఖాతాలో వేసుకోవాలని మయాంక్ సారథ్యంలోని కర్ణాటక చూస్తోంది. మ.1.30కు మ్యాచ్ ప్రారంభం కానుండగా జియో యాప్, స్పోర్ట్ 18 ఛానల్‌లో లైవ్ చూడవచ్చు.