News June 18, 2024
నిజామాబాద్ జిల్లాకు ఎల్లో అలర్ట్

నిజామాబాద్ జిల్లాకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. రాగల ఐదు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలుంటాయని వాతావరణ విభాగం తెలిపింది. ఈ నెల 22 వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.
Similar News
News September 14, 2025
జాతీయ మెగా లోక్-అదాలత్ లో 7,444 కేసులలో రాజీ

జాతీయ మెగా లోక్-అదాలత్ లో 7,444 కేసులలో రాజీ జరిగిందని NZB CP సాయి చైతన్య జాతీయ మెగా లోక అదాలత్ లో భాగంగా వివిధ కేసులలో రాజీ పడి పరిష్కారం అయినందునకు నిజామాబాద్ జిల్లాకు 4వ స్థానం దక్కిందని, సైబర్ నేరగాళ్ల చేతిలో కోల్పోయిన రూ.42,45,273-00ను సైతం తిరిగి సైబర్ బాధితులకు అందజేసినట్లు వివరించారు. జిల్లాను అగ్రగామిగా ఉంచడంలో కృషి చేసిన సిబ్బందిని ఆయన అభినందించారు.

త్వరలో నిజామాబాద్ – ముంబై మధ్య వందే భారత్ రైలు: MP

త్వరలోనే నిజామాబాద్ – ముంబై మధ్య వందే భారత్ రైలు ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకుంటున్నట్లు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. శనివారం జరిగిన NZB చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. వందే భారత్ రైలు మంజూరు కోసం చేసిన వినతి, రైల్వే మంత్రిత్వ శాఖ వద్ద పెండింగ్‌లో ఉందని తెలిపారు.