News June 18, 2024
స్వలింగ వివాహాలకు థాయ్‌లాండ్ ఆమోదం

థాయ్‌లాండ్ ప్రభుత్వం స్వలింగ వివాహాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేషనల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మ్యారేజ్ ఈక్వాలిటీ బిల్లుకు పెద్దల సభ అయిన సెనేట్‌లోనూ ఆమోదం లభించింది. 130 మంది సెనేటర్లు బిల్లుకు అనుకూలంగా ఓటు వేయగా, నలుగురు వ్యతిరేకించారు. థాయ్‌లాండ్ రాజు ఆమోదం తెలిపిన 120 రోజుల తర్వాత ఈ చట్టం అమలులోకి వస్తుంది. సేమ్ సెక్స్ మ్యారేజ్‌ను లీగల్ చేసిన తొలి ఆగ్నేయాసియా దేశంగా థాయ్‌లాండ్ నిలిచింది.
Similar News
News November 5, 2025
వరి కోత అనంతరం తీసుకోవలసిన జాగ్రత్తలు

వరిని నూర్చేటప్పుడు వేర్వేరు రకాల ధాన్యం కలవకుండా జాగ్రత్త పడాలి. నూర్చిన ధాన్యాన్ని శుభ్రంగా తూర్పారబోసి చెత్త, తాలు, మట్టి బెడ్డలను ఏరేయాలి. చౌడు నేలల్లో పండించిన ధాన్యాన్ని, చీడపీడలు ఆశించి రంగు మారిన ధాన్యాన్ని మంచి ధాన్యంతో కలపకూడదు. తూర్పార బెట్టిన ధాన్యంలో మట్టి గడ్డలు, గడ్డి, కలుపు విత్తనాలు, మొక్కల అవశేషాలు లేకుండా చూడాలి. ఇలా శుభ్రం చేసిన ధాన్యం ఎక్కువ కాలం నిల్వ ఉండి మంచి ధర వస్తుంది.
News November 5, 2025
‘ఇద్దరు పిల్లల’ నిబంధన ఎత్తివేత.. నేడు ఉత్తర్వులు

TG: స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ‘ఇద్దరు పిల్లల’ నిబంధనను ఎత్తివేసే ఆర్డినెన్స్‌కు గవర్నర్ జిష్ణుదేశ్ ఆమోదం తెలిపారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు ఇవ్వనుంది. ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉంటే పోటీకి అనర్హులుగా పేర్కొంటూ చేసిన చట్టం 1995 నుంచి అమల్లో ఉంది. తాజా నిర్ణయంతో పంచాయతీ, MPTC, ZPTC, పురపాలక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నవారూ పోటీ చేసేందుకు వీలు కలుగుతుంది.
News November 5, 2025
తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?

కార్తీక పౌర్ణమి వేళ బంగారం ధరలు తగ్గి కొనుగోలుదారులకు ఉపశమనాన్నిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.980 తగ్గి రూ.1,21,480కు చేరింది. 22క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.900 పతనమై రూ.1,11,350 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ. 2,000 తగ్గి రూ. 1,63,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


