News June 18, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం?

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. SIBకి టెక్నికల్ సపోర్ట్ అందించిన ఇన్నోవేషన్ ల్యాబ్ ఛైర్మన్ రవికుమార్ నుంచి హార్డ్ డిస్క్‌లను సిట్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. రవికుమార్‌కు చెందిన హైదరాబాద్, బెంగళూరులోని ఇళ్లు, కార్యాలయాల్లో మూడు సర్వర్లు, ఐదు మినీ డివైజ్‌లనూ వెంట తీసుకెళ్లారని తెలుస్తోంది. కాగా ఫోన్ ట్యాపింగ్‌కు ప్రణీత్ రావు ఈ ల్యాబ్ సహకారమే తీసుకున్నారు.

Similar News

News March 17, 2026

ఎంత ఇబ్బంది ఉంటే పార్టీ మార్పుపై ఆలోచిస్తా: జీవన్ రెడ్డి

image

TG: తాను <<19382690>>పార్టీ<<>> మారాలనుకునే ఆలోచనకు కారణం జగిత్యాల MLA సంజయ్ అని సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌తో తనది 40 ఏళ్ల బంధమన్న ఆయన.. తనకు ఎంత ఇబ్బంది ఉంటే పార్టీ మార్పుపై ఆలోచిస్తున్నానో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. ఇంకా కాంగ్రెస్‌లోనే ఉండాలని కోరుకుంటున్నానన్నారు. పార్టీ పిలుపు మేరకు 4 దశాబ్దాలుగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టానన్నారు. చూడాలి జగిత్యాలలో మున్ముందు ఏం జరుగుతుందో.

News March 17, 2026

టెస్టులకు సడన్‌గా రిటైర్మెంట్.. కారణం వెల్లడించిన అశ్విన్

image

టెస్టులకు సడన్‌గా రిటైర్మెంట్ ప్రకటించడంపై అశ్విన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పష్టతనిచ్చారు. ‘టీమ్‌లో సీనియర్ బౌలర్ నేనుండగా పెర్త్ టెస్టులో(2024లో AUSతో) సుందర్‌ను ఆడించారు. అప్పుడే నా టైమ్ అయిపోయిందని గ్రహించా’ అని వెల్లడించారు. గంభీర్ అంటే తనకు ఇష్టమని, ఆయన వ్యక్తుల కంటే జట్టుకే ప్రాధాన్యం ఇస్తారని చెప్పారు. కోహ్లీ, రోహిత్, తాను ఎప్పుడూ ఒకరినొకరు నిందించుకోలేదని, గెలుపు కోసమే ప్రయత్నించామన్నారు.

News March 17, 2026

ప్లాస్టిక్ ధరల పెరుగుదల.. కీలక రంగాలకు సెగ

image

కేరళంలోని ప్లాస్టిక్ ప్రాసెసింగ్ యూనిట్లు ముడిసరకు ధరల పెరుగుదల, మూలధన కొరతతో మూతపడుతున్నాయి. దీనివల్ల FMCG, ఫుట్‌వేర్, హెల్త్‌కేర్ సెక్టార్ సప్లై చైన్ తీవ్రంగా దెబ్బతిన్నది. సుమారు 20-25% యూనిట్లు ఆపరేషన్స్ నిలిపివేసినట్లు కేరళ ప్లాస్టిక్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ తెలిపింది. ఫలితంగా బాటిళ్లు, సోల్స్, ప్యాకేజింగ్ మెటీరియల్స్ వంటి ఉత్పత్తుల మేకింగ్ ఛార్జీలు పెరిగాయి.