News June 18, 2024
పూరన్ దెబ్బకు గేల్, సూర్య రికార్డులు బ్రేక్

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఐదో ఆటగాడిగా వెస్టిండీస్ ప్లేయర్ నికోలస్ పూరన్ రికార్డులకెక్కారు. ఇప్పటివరకు పూరన్ 128 సిక్సర్లు బాదారు. ఈ క్రమంలో క్రిస్ గేల్ (124), సూర్యకుమార్, ఫించ్ (125) రికార్డులను ఆయన బద్దలు కొట్టారు. 194 సిక్సర్లతో రోహిత్ శర్మ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. మార్టిన్ గప్టిల్ (173), జోస్ బట్లర్ 130), మ్యాక్స్‌వెల్ (129) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
Similar News
News March 12, 2026
15 నుంచి ఒంటిపూట బడులు.. జీవో జారీ

TG: ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభించాలని విద్యాశాఖ GO జారీ చేసింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల్లో APR 23 వరకు హాఫ్ డే స్కూల్స్ కొనసాగుతాయని పేర్కొంది. ఉ.8 గంటల నుంచి మ.12.30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని ఆదేశించింది. అయితే 15న ఆదివారం కావడంతో సోమవారం నుంచి ఇది అమల్లోకి రానుంది. బోర్డ్ ఎగ్జామ్స్ దృష్ట్యా 10వ తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసులు కొనసాగుతాయని వెల్లడించింది.
News March 12, 2026
పెట్రోల్, డీజిల్ ఉంది.. ఆందోళన వద్దు: IOCL

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత లేదని ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రకటించింది. దేశంలోని అన్ని ఇండియన్ ఆయిల్ బంకులు పూర్తిస్థాయిలో పని చేస్తున్నాయని, సరిపడా నిల్వలు ఉన్నాయని తెలిపింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా పెట్రోల్, డీజిల్ సప్లై చేస్తున్నామని, వాహనదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.
News March 12, 2026
ఇండక్షన్ స్టవ్ కోసం చూస్తున్నారా?

వంటగ్యాస్ కొరతతో చాలా మంది ఇండక్షన్ స్టవ్‌లు కొనుగోలు చేస్తున్నారు. ఇవి విద్యుదయస్కాంత శక్తితో పని చేస్తాయి. దానిపై ఉన్న కాపర్ కాయిల్ ద్వారా విద్యుత్ ప్రవహించినప్పుడు అయస్కాంత క్షేత్రం ఏర్పడి పాత్ర వేడెక్కుతుంది. అయితే ఈ స్టవ్‌పై అన్ని రకాల పాత్రలు పని చేయవు. ఇండక్షన్ బేస్ ఉన్న స్టెయిన్ లెస్ స్టీల్ పాత్రలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ స్టవ్ ధరలు రూ.1,200-రూ.5,000 వరకు ఉంటాయి.


