News June 18, 2024

శ్రీకాకుళం: సిరిమానోత్సవంలో అపశ్రుతి.. ఒకరి మృతి

image

ఎచ్చెర్ల మండల పరిధిలోని కుప్పిలి గ్రామంలో మంగళవారం గ్రామ దేవత శ్రీ అసిరితల్లి సిరిమానోత్సవంలో అపశ్రుతి నెలకొంది. స్థానికుల వివరాలు.. గ్రామంలో ఉరేగిస్తున్న సిరిమాను ఒక్కసారిగా విరిగిపోవడంతో సిరిమానుపై కూర్చున్న పూజారి కింద ఉన్న వారిపై పడ్డారు. తీవ్రంగా గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించగా కారి పల్లేటి అనే వ్యక్తి మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. అప్పన్న అనే మరో వ్యక్తి పరిస్థితి సీరియస్‌గా ఉంది.

Similar News

News March 14, 2026

సిక్కోలు దొర..సేవలు మరువలేం

image

మారుమూల గ్రామంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి సిక్కోలు జిల్లాకు పేరు ప్రతిష్ఠలు తీసుకొచ్చిన హనుమంతు జగన్నాథ దొర మన ప్రాంత వాసి కావడం గర్వకారణం.1943లో కోటబొమ్మాళి(M) జర్జంగిలో జన్మించిన హెచ్. జె.దొర పోలీసు శాఖలో 40 ఏళ్లుగా పని చేశారు. స్వగ్రామంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి కళ్యాణమండపం, శివాలయాన్ని నిర్మించారు. సొంత ఇంటిని వృత్తి విద్యా శిక్షణా కేంద్రంగా మార్చి నిరుద్యోగులకు బాసటగా నిలిచారు.

News March 14, 2026

గారలో బౌద్ధక్షేత్రాన్ని సందర్శించిన జపనీస్

image

గార మండలం సాలిహుండం బౌద్ధక్షేత్రాన్ని జపాన్ దేశానికి చెందిన బృందం నేడు సందర్శించారు. ప్రాచీన బౌద్ధ స్మారకాలు, స్థూపాల అవశేషాలను ఆసక్తిగా పరిశీలించి వాటి చారిత్రక ప్రాముఖ్యతపై తెలుసుకున్నారు. ఈ సందర్శనతో సాలిహుండం అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు పొందే అవకాశం ఉందని స్థానికులంటున్నారు. ప్రజలు, ప్రతినిధులను వీరిని ఆత్మీయంగా ఆహ్వానించారు.

News March 14, 2026

శ్రీకాకుళం: ఫోటోల అశ్లీల మార్ఫింగ్‌ చేసిన విద్యార్థిపై కేసు

image

శ్రీకాకుళం రూరల్ పరిధి మునసబుపేటలోని ఓ ప్రైవేట్ కళాశాలలో విద్యార్థినిల ఫోటోల అశ్లీల మార్ఫింగ్ అంశంలో అసలెంత మంది పాత్ర ఉందనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనల నేపథ్యంలో ప్రిన్సిపల్ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. కళాశాలలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిపై కేసు నమోదైంది. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపడితే మరిన్ని విషయాలు వెలుగులోకి రానున్నాయి.